‘లక్కీ భాస్కర్‌’తో దుల్కర్‌ అసాధారణమైన ప్రయాణం

4 Feb, 2024 00:15 IST|Sakshi

మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌ కెరీర్‌ ఆరంభమై పుష్కర కాలం అయింది. ఇన్నేళ్లల్లో మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వినూత్న చిత్రాలు, పాత్రలు చేస్తూ వస్తున్నారు దుల్కర్‌. ఇక పన్నెండేళ్లయిన సందర్భంగా దుల్కర్‌ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్‌’ ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేశారు చిత్ర నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.

మీనాక్షి చౌదరి కథానాయిక. ‘‘ఈ చిత్రంలో మగధ బ్యాంక్‌లో క్యాషియర్‌గా పని చేసే దుల్కర్‌ లుక్‌ని విడుదల చేశాం. 1980ల నాటి బొంబాయి నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఒక సాధారణ మనిషి తాలూకు అసాధారణమైన ప్రయాణమే ఈ సినిమా. ప్రస్తుతం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది’’ అని యూనిట్‌ పేర్కొంది. తెలుగు, మలయాళ, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega