రాసి పెట్టుకోండి.. అందర్నీ నవ్విస్తాం

29 Nov, 2023 00:09 IST|Sakshi
వక్కంతం వంశీ, నితిన్, సుధాకర్‌ రెడ్డి, సునీల్‌ నారంగ్‌

నితిన్‌ 

‘‘నటుడిగా నా 21 ఏళ్ల కెరీర్‌లో ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ నా 32వ సినిమా. నేను చేసిన మంచి పాత్రల్లో ఈ చిత్రం నంబర్‌ వన్‌ అవుతుంది. వక్కంతం వంశీగారు కథ అందించిన ‘కిక్, రేసు గుర్రం, టెంపర్‌’ సినిమాలన్నీ హిట్‌ అయ్యాయి. ఈ చిత్రాలకు ఏ మాత్రం తగ్గకుండా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ మూవీ ఉంటుంది. ప్రేక్షకులందర్నీ నాన్‌ స్టాప్‌గా నవ్విస్తాం’’ అని హీరో నితిన్‌ అన్నారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’. శ్రేష్ఠ్‌ మూవీస్, ఆదిత్య మూవీస్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్, రుచిర ఎంటర్‌టైన్‌ మెంట్స్‌పై సుధాకర్‌ రెడ్డి, నికితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్‌ 8న విడుదల కానుంది.

హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా ట్రైలర్‌ విడుదల వేడుకలో నితిన్‌ మాట్లాడుతూ– ‘‘ఈ మూవీలో స్క్రీన్‌ ప్లే  కొత్తగా ఉంటుంది. మంచి కథ, పాటలు, చక్కని డ్యాన్స్‌ కూడా ఉంటాయి. డిసెంబర్‌ 8న హిట్‌ సాధించబోతున్నాం.. ఇది కచ్చితం.. రాసి పెట్టుకోండి’’ అన్నారు. ‘‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌కి మమ్మల్ని సపోర్ట్‌ చేయటానికి వచ్చిన అభిమానులు, ప్రేక్షకులకు థ్యాంక్స్‌’’ అన్నారు ఎన్‌. సుధాకర్‌ రెడ్డి. ‘‘అద్భుతమైన ఔట్‌పుట్‌ ఇవ్వటానికి నేను, నితిన్‌ రెండేళ్లు కష్టపడ్డాం. అందర్నీ ఎంటర్‌టైన్‌ చేయాలని రెండేళ్లు కష్టపడి చాలా జాగ్రత్తగా ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేశాం’’ అన్నారు వక్కంతం వంశీ.
 

మరిన్ని వార్తలు