నేడు రెండు క్రేజీ సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయ్‌

2 Nov, 2023 08:10 IST|Sakshi

నేడు రెండు క్రేజీ సినిమాలు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాయి.. రామ్‌- బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన 'స్కంద' హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది. బాలీవుడ్‌ కింగ్‌ షారుక్‌ ఖాన్‌- ఆట్లీ కాంబోలో వచ్చిన 'జవాన్‌' నెట్‌ఫ్లిక్స్‌లో రన్‌ అవుతుంది. ఈ రెండు చిత్రాలను థియేటర్‌కు వెళ్లి చూడని వారు ఈ వీకెండ్‌లో ఇంట్లోనే కూర్చోని చూసి ఎంజాయ్‌ చేయవచ్చు.

జవాన్‌- నెట్‌ఫ్లెక్స్‌
బాలీవుడ్ కలెక్షన్స్‌ కింగ్‌  షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ అట్లీ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ జవాన్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో కూడా వచ్చేసింది. నేడు నవంబర్‌ 2 షారుక్ పుట్టినరోజు సందర్భంగా 'జవాన్'ని ఓటీటీలో రిలీజ్‌ చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్‌ఫ్లిక్స్‌లో అర్థరాత్రి నుంచే స్ట్రీమింగ్ అవుతుంది. షారుక్ ఖాన్ తండ్రికొడుకుగా నటించిన 'జవాన్' సుమారు రూ. 1100 కోట్లకు పైగా కలెక్షన్స్‌ సాధించింది. ఇందులో నయనతార,దీపికా పదుకోన్‌,విజయ్‌ సేతుపతి వంటి స్టార్స్‌ ఏ మాత్రం తగ్గకుండా మెప్పించారు. థియేటర్‌లో ఈ సినిమా చూడని వారు నెట్‌ఫ్లెక్స్‌లో చూడొచ్చు.

స‍్కంద- హాట్‌స్టార్‌
రామ్‌ పోతినేని, యంగ్‌ హీరోయిన్‌ శ్రీలీల జంటగా నటించిన చిత్రం 'స్కంద'. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్‌ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జీ స్టూడియోస్‌తో కలిసి శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. మొదటిరోజు నంచే ఈ చిత్రం మిక్స్‌డ్‌ టాక్‌ అందుకుంది. ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా కలెక్షన్స్‌ రాబట్టలేదు. తాజాగా హాట్‌స్టార్‌ ఓటీటీలో 'స్కంద' ఎంట్రీ ఇచ్చేసింది. అర్థరాత్రి నుంచే స్ట్రీమింగ్‌ అవుతుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. హిందీ వర్సెన్‌ కూడా ఉంటుందని ఆశించిన అభిమానులకు నిరాశే కలిగింది. థియేటర్‌లలో మెప్పించలేకపోయిన స్కంద.. ఓటీటీలో ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

A post shared by Netflix India (@netflix_in)

మరిన్ని వార్తలు