NTR 30 Movie: జూనియర్‌ ఎన్టీఆర్ బర్త్‌ డే.. ఈసారి ఫ్యాన్స్‌కు రచ్చ రచ్చే!

15 May, 2023 16:04 IST|Sakshi

ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్  నటిస్తున్న మూవీ  'ఎన్టీఆర్ 30'. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల, తారక్ కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ ఇదే కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. 

(ఇది చదవండి: ఫ్యాన్స్‌కు బిగ్‌ సర్‌ప్రైజ్.. 'ఎన్టీఆర్ 30' లాంఛ్‌కు ఊహించని గెస్ట్!)

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్ టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. మే 20న జూనియర్ ఎన్టీఆర్ బర్త్‌డేను పురస్కరించుకుని ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై అభిమానులు సోషల్ మీడియాలో పెద్దఎత్తున పోస్టులు పెడుతున్నారు. అంతే కాకుండా అదే రోజు సింహాద్రి కూడా రీ రిలీజ్ చేయనున్నారు. దీంతో జూనియర్ బర్త్ డేకు ఫ్యాన్స్‌కు డబుల్ సర్‌ప్రైజ్‌ ఉండనుంది. కాగా.. ఇటీవలే హైదరాబాద్‌ జరిగిన షూటింగ్‌లో సైఫ్ అలీఖాన్ కూడా పాల్గొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ తన నెక్ట్స్‌ మూవీ కోసం వెట్రిమారన్‌తో జతకట్టనున్నారు. 

(ఇది చదవండి: ఈ వారం ఓటీటీ/ థియేటర్స్‌లో సందడి చేసే చిత్రాలివే)

మరిన్ని వార్తలు