Kaliyugam Pattanamlo: ‘కలియుగం పట్టణంలో’ మూవీ రివ్యూ

29 Mar, 2024 14:32 IST|Sakshi
Rating:  

టైటిల్‌: కలియుగం పట్టణంలో
నటీనటులు: విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్‌, దేవీ ప్రసాద్‌, రూప లక్ష్మీ
నిర్మాణ సంస్థ:నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్
నిర్మాతలు: డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌‌
రచన-దర్శకత్వం: రమాకాంత్‌ రెడ్డి
సంగీతం: అజయ్
సినిమాటోగ్రఫీ: చరణ్
విడుదల తేది: మార్చి 29, 2024

కథేంటంటే..
నంద్యాలకు చెందిన మోహన్‌(దేవీ ప్రసాద్‌), కల్పన(రూప లక్ష్మీ) దంపతులకు కవల పిల్లలు జన్మిస్తారు. పేర్లు విజయ్‌(విశ్వ కార్తికేయ), సాగర్‌(విశ్వ కార్తికేయ). వీరిద్దరిలో సాగర్‌కి చిన్నప్పటి నుంచే ఓ సైకాలజీకల్‌ ప్రాబ్లం ఉంటుంది. రక్త చూసి ఆనందపడుతుంటాడు. తన సైకో ప్రవర్తన చూసి భయపడిపోయిన మోహన్‌..అతన్ని మెంటల్‌ ఆస్పత్రిలో జాయిన్‌ చేస్తాడు. విజయ్‌ మాత్రం చక్కగా చదువుకుంటుంటాడు. కాలేజీలో శ్రావణి(ఆయుషి పటేల్‌) అతన్ని ఇష్టపడుతుంది. కానీ ఆ విషయాన్ని మూడేళ్ల పాటుగా విజయ్‌తో చెప్పలేకపోతుంది. మరోవైపు నంద్యాలలో వరుస హత్యలతో పాటు ఆడపిల్లలు బయటకు చెప్పుకోలేని ఘోరాలు జరుగుతుంటాయి. వాటి వెనుక ఉన్నదెవరో కనిపెట్టేందుకు పోలీస్ అధికారి (చిత్రా శుక్లా) నంద్యాలకు వస్తుంది. ఆమె కనిపెట్టిన విషయాలు ఏంటి? అమ్మాయిలపై అత్యాచారాలకు పాల్పడుతున్న దుండగులను చంపుతున్నదెవరు?  హత్యలతో పాటు అక్కడ జరుగుతున్న మరో ఘోరం ఏంటి? సాగర్‌, విజయ్‌లలో ఎవరు మంచి వారు? నంద్యాలలో జరిగే ఘోరాలకు వీరికి ఉన్న సంబంధం ఏంటి? చివరకు పోలీసులు నంద్యాల క్రైంకి ఎలా చెక్‌ పెట్టారు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

ఎలా ఉందంటే..
తల్లిదండ్రులు పెంచే తీరుతోనే పిల్లలు ఎదుగుతారు. పెంపకం వల్లే పిల్లలు మంచివారుగా, చెడ్డవారుగా తయారవుతారు.ప్రతీ మనిషిలో సైకిక్ ఫీలింగ్ ఉంటుంది. కానీ తల్లిదండ్రుల పెంపకం వల్లే అది తగ్గుతుంది. ఇదే విషయాన్ని ‘కలియుగం పట్టణంలో’ చూపించాడు దర్శకుడు రమాకాంత్‌ రెడ్డి. దర్శకుడు ఓ మంచి పాయింట్‌ని ఎంచుకొని దాని చుట్టు ఆసక్తికరమైన కథను అల్లుకున్నాడు. ప్రతీ ఒక్క పాత్రకు డిఫరెంట్ షేడ్స్ ఉండేలా జాగ్రత్త పడ్డాడు. కానీ తెరపై తాను అనుకున్నది అనుకున్నట్లుగా చూపించడంలో కాస్త తడబడ్డాడు.

సంబంధం సీన్లను చూపిస్తూ.. ఫస్టాఫ్‌ అంతా ప్రశ్నలు, చిక్కుముల్లతోనే సాగించాడు. నిజంగా నంద్యాలలో ఏం జరుగుతుంది? అనేది ప్రేక్షకుడికి కూడా ఫస్టాఫ్‌లో తెలియదు. ప్రతి పాత్రపై అనుమానం కలిగిస్తూ.. సెకండాఫ్‌పై ఆసక్తికలిగించేలా చేశాడు.  ఫస్టాఫ్‌లోని ప్రశ్నలన్నింటికి సెకండాఫ్‌లో సమాధానం దొరుకుతుంది. ట్విస్టుల ఒక్కోటి రీవీల్ అవుతుంటే ప్రేక్షకుల మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.  క్లైమాక్స్ ట్విస్టులు, రెండో పార్ట్ కోసం పెట్టుకున్న కథ బాగుంది. స్క్రీన్‌ప్లేను ఇంకాస్త బలంగా రాసుకొని, పేరున్న నటీనటులను పెట్టుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది.

ఎవరెలా చేశారంటే..
విజయ్, సాగర్ పాత్రల్లో విశ్వ కార్తికేయ చక్కగా నటించాడు. రెండు విభిన్న పాత్రలో కనిపించిన రామ్‌.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్‌ చూపించి ఆకట్టుకున్నాడు.ఆయుషి పటేల్ కి ఇది తొలి సినిమానే అయినా చక్కగా నటించింది. ఆమె పాత్ర ఇచ్చే ట్విస్ట్‌ ఆకట్టుకుంటుంది. పోలీసు అధికారిణిగా చిత్రా శుక్లా తొలిసారి డిఫరెంట్‌ రోల్‌ ప్లే చేసి ఆకట్టుకుంది. ఇక నరేన్ తన పాత్రలో అద్భుతంగా నటించేశాడు. దేవీ ప్రసాద్, రూప లక్ష్మి, అనీష్ కురువిల్ల ఇలా అన్ని పాత్రలు ఓకే అనిపిస్తాయి.

టెక్నికల్ గా కలియుగం పట్టణంలో మెప్పిస్తుంది. అజయ్ పాటలు, అర్ అర్ సినిమాకి ప్లస్. చరణ్ సినిమాటోగ్రఫీ బాగుంది. మాటలు కొన్ని చోట్ల మెప్పిస్తాయి. ఆలోచింపజేస్తాయి. నిర్మాణ పరంగా సినిమా బాగుంటుంది. లైవ్ లొకేషన్స్ వల్ల ఫ్రేమ్స్ అన్నీ కూడా ఎంతో సహజంగా అనిపిస్తాయి. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారని అర్థం అవుతోంది.

Rating:  
(2.5/5)

Election 2024

మరిన్ని వార్తలు