చంద్రముఖికి కంగనా ట్రబుల్స్‌.. నిర్మాతకు తడిసి మోపెడు అవుతోందా?

12 Jan, 2023 10:12 IST|Sakshi

నటి కంగనారనౌత్‌ పేరే ఒక సంచలనం. అంతకు మించి వివాదాస్పదం. సమస్యలకు, విమర్శలకు కేరాఫ్‌. అయితే ఈమెలో ఒక దర్శకురాలు, నిర్మాత ఉన్నారు. అందుకే కాస్త పొగరు అని కూడా అంటారు. 2021లో జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన తలైవి చిత్రంలో కంగనా టైటిల్‌ రోల్‌ పోషించిన విషయం తెలిసిందే.

తాజాగా చంద్రముఖి–2లో నటిస్తున్నారు. రజనీకాంత్‌ కథానాయకుడిగా వచ్చిన చంద్రముఖి చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతోంది. దర్శకుడు పి.వాసు దర్శకత్వంలో రజనీకాంత్‌ పాత్రలో లారెన్స్‌ నటిస్తున్నారు. కాదీన్ని లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇక్కడి వరకూ బాగానే ఉంది. కంగనా రనౌత్‌తో ఉండే బృందంతోనే ఇప్పుడు చిక్కంతా. ఈమె వెంట పెద్ద పర్సనల్‌ మేకప్‌మెన్, బౌన్సర్లు, వ్యక్తిగత సిబ్బందితో పాటు నలుగురు సీఆర్‌పీఎఫ్‌ సెక్యూరిటీ ఉన్నారట.

వాళ్ల ఖర్చులన్నీ నిర్మాతలే భరించాల్సి వస్తోందట.  దీంతో నిత్యం ఏదో సమస్య వస్తూనే ఉంటోందట. ఎదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసే కంగనారనౌత్‌ సీఆర్‌పీఎఫ్‌ బృందాన్ని రక్షణగా ఏర్పాటు చేసుకుందనే ప్రచారం ఒకటి ఉంది. కాగా వీరితోనే చిత్ర యూనిట్‌కు భారంగా మారుతోందని గగ్గోలు పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి వాటిని ఎదుర్కొంటూ దర్శకుడు పి.వాసు చంద్రముఖి 2 చిత్రాన్ని త్వరగా పూర్తి చేయగలరా? అనే ప్రశ్న తలెత్తుతోంది.  

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు