Atharva Teaser : ఆసక్తి రేపుతున్న అథర్వ టీజర్‌ చూశారా?

20 Mar, 2023 18:38 IST|Sakshi

యువ హీరో కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, హీరో,హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం అథర్వ.ఈ సినిమాకు మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా సుభాష్ నూతలపాటి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్‌ టీజర్‌ను విడుదల చేశారు. ఇప్పటికే టైటిల్‌, మోషన్‌ పోస్టర్‌తో సినిమాపై క్యూరియాసిటిని పెంచేసిన యూనిట్‌ తాజాగా టీజర్‌ రిలీజ్‌తో మరింత ఆసక్తిని పెంచింది. 
 

మరిన్ని వార్తలు