Kiara Advani-Sidharth Malhotra : పెళ్లి పీటలెక్కనున్న సిధ్‌-కియారా.. త్వరలోనే అనౌన్స్‌మెం‍ట్‌

31 Dec, 2022 11:35 IST|Sakshi

బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ కియారా అద్వానీ-సిద్దార్థ్‌ మల్హోత్రాలు గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నట్లు బీటౌన్‌లో వార్తలు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరి రిలేషన్‌పై ఈ జంట ఎప్పుడూ స్పందించలేదు. తమ ప్రేమను గొప్యంగా ఉంచుతూ వస్తున్నారు. కానీ వీళ్లిద్దరూ కలిసి హాలీడే వెకేషన్స్‌కి వెళ్లడం, ముంబై రోడ్లపై చెట్టాపట్టాలేసుకుంటూ మీడియా కెమెరాలకు చిక్కుతుండటంతో వీరద్దరి మధ్య సమ్‌థింగ్‌, సమ్‌థింగ్‌ నడుస్తోందని అంతా ఫిక్స్‌ అయ్యారు.

తాజాగా ఈ జంట పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 6న వీరి వివాహం ఘనంగా జరగనున్నట్లు సమాచారం.  ఫిబ్రవరి 4, 5 తేదీల్లో మెహిందీ, హల్దీ, సంగీత్ కార్యక్రమాలు జరగనున్నాయట.పెళ్లివేడుక కోసం రాజ‌స్థాన్‌లోని జైస‌ల్మేర్ ఫోర్ట్‌ను ఇప్పటికే ఖరారు చేశారని టాక్‌ వినిపిస్తుంది.

కుటుంబ‌స‌భ్యులు,స‌న్నిహితుల‌తో పాటు కొద్ది మంది బాలీవుడ్ ప్ర‌ముఖులు సిధ్‌, కియారా పెళ్లికి హాజ‌రుకానున్నారట. జ‌న‌వ‌రిలో త‌మ పెళ్లి గురించి సిద్ధార్థ్‌, కియారాలు అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు