విషాదం: టాలీవుడ్‌ యువ దర్శకుడు కరోనాతో మృతి

1 May, 2021 11:02 IST|Sakshi

యంగ్ డైరెక్టర్ కుమార్ వట్టి  కన్నుమూత

‘మా అబ్బాయి’ మూవీతో దర్శకుడిగా ఎంట్రీ

రెండో సినిమాకు రడీ అవుతుండగా విషాదం

సాక్షి, హైదరాబాద్‌:  కరోనా మహమ్మారి  తెలుగు సినీ పరిశ్రమను అతలాకుతలం చేస్తోంది. తాజాగా.. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ కుమార్ వట్టి(39) కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల కరోనా బారిన పడిన  ఆయన శ్రీకాకుళంలోని గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ స్కూల్ అండ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. విరాట పర్వం డైరెక్టర్‌ వేణు ఉడుగుల ఈ విషయాన్ని ట్విటర్‌లో షేర్‌ చేశారు.ఈ సందర్భంగా కుమార్‌ వట్టి కుటుంబానికి ప్రగాఢసానుభూతి  ప్రకటించారు.

నరసన్నపేటకు చెందిన కుమార్ వట్టి  2017లో ‘మా అబ్బాయి’ అనే సినిమాతో దర్శకుడిగా మారారు.  శ్రీవిష్ణు హీరోగా, ప్రఖ్యాత ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్  కాంబినేషన్‌లో వచ్చిన ఈ మూవీతోనే కుమార్ వట్టి దర్శకుడిగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. దర్శకుడు పరుశురాం దగ్గర ‘యువత’ సినిమా అసిస్టెంట్‌గా పని చేశారు. ఆ తర్వాత సోలో, అంజనేయులు, సారొచ్చారు సినిమాలకు కూడా పనిచేశారు. 30 కి పైగా చిత్రాలలో అసిస్టెంట్ ఎడిటర్‌గా పనిచేశారు. అలాగే డైరెక్టర్‌గా రెండో సినిమాకు కథను కూడా సిద్ధం చేసుకున్నారు. ఇంతలోనే  కుమార్ వట్టి అకాలమృతితో పరిశ్రమలో విషాదం అలుముకుంది. పలువురు సినీ ప్రముఖులు, వట్టి కుమార్‌తో కలిసి పనిచేసిన పరిశ్రమకు చెందిన పలువురు కూడా సంతాపం తెలిపారు.

చదవండి: ఆక్సిజన్‌ లెవల్స్‌: ప్రోనింగ్‌ టెక్నిక్‌ అంటే తెలుసా?

మరిన్ని వార్తలు