‘మేజర్‌’ సినిమా మాత్రమే కాదు.. ఒక ఎమోషన్‌: వీవీఎస్‌ లక్ష్మణ్‌

22 Jun, 2022 08:30 IST|Sakshi

26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్‌’. అడివి శేష్‌ లీడ్‌ రోల్‌ పోషించిన ఈ చిత్రానికి శశి కిరణ్‌ తిక్క దర్శకత్వం వహించారు. జూన్‌ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా చూసిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మేజర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అంటూ కితాబిస్తున్నారు.

(చదవండి: 'మేజర్‌' టీమ్‌కు వెండి నాణేన్ని బహుకరించిన సీఎం)

తాజాగా ఈచిత్రంపై  టీమిండియా మాజీ ఆటగాడు, జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) చైర్మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. ‘ఇప్పుడే మేజర్‌ సినిమాను చూశాను. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు.. ఒక ఎమోషన్‌. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ నిజమైన స్ఫూర్తిదాయకమైన కథ ఇది. మీకు బాగా నచ్చుతుంది. అడివి శేష్‌ అద్భుతంగా నటించి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. కచ్చితంగా చూడాల్సిన మూవీ ఇది’అని లక్ష్మణ్‌ ట్వీట్‌ చేశాడు. 

మరిన్ని వార్తలు