‘మేజర్‌’ ఆపరేషన్‌ మళ్లీ ఆరంభం

13 Aug, 2021 00:35 IST|Sakshi
అడివి శేష్‌

ముంబయ్‌లో 2008 నవంబరు 26న జరిగిన ఉగ్రవాద దాడుల్లో వీరోచితంగా పోరాడిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘మేజర్‌’. అడివి శేష్‌  హీరోగా నటిస్తున్నారు. ‘గూఢచారి’ ఫేమ్‌ శశికిరణ్‌ తిక్క దర్శకుడు. జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌ సంస్థలతో కలసి సోనీ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. సందీప్‌ పాత్రలో శేష్‌ చేస్తున్న ఈ ఆపరేషన్‌ గురువారం మళ్లీ ఆరంభమైంది. ఈ చిత్రం చివరి షెడ్యూల్‌ ఇది. అడివి శేష్‌ మాట్లాడుతూ– ‘‘ఇది నా ప్యాషన్‌ ప్రాజెక్ట్‌. ముంబయ్‌ విషాద ఘటనను వార్తల్లో చూసినప్పటి నుండి ఈ చిత్రంతో నా జర్నీ మొదలైంది. సందీప్‌ వంటి ధైర్యవంతుడి పాత్ర చేసే చాన్స్‌ నాకు ఇచ్చిన ఆయన తల్లితండ్రులకు కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘ఈ షెడ్యూల్‌లో అడివి శేష్, సయీ మంజ్రేకర్‌ పాల్గొంటున్నారు. ఈ నెలాఖరుకి షూటింగ్‌ పూర్తవుతుంది. హిందీ, తెలుగు, మలయాళంలో ఈ ఏడాదే మా సినిమా రిలీజ్‌Sకానుంది’’ అన్నారు శశికిరణ్‌ తిక్క.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు