దుల్కర్‌కు జోడీగా..? 

15 Sep, 2023 02:04 IST|Sakshi
మీనాక్షీ చౌదరి

తెలుగు పరిశ్రమలో కథానాయికగా మీనాక్షీ చౌదరికి అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’, వరుణ్‌తేజ్‌ ‘మట్కా’, విశ్వక్‌ సేన్‌ సినిమాల్లో హీరోయిన్‌గా చేస్తున్నారీ బ్యూటీ.

తాజాగా దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా రూపొందనున్న ‘లక్కీభాస్కర్‌’ చిత్రంలోని హీరోయిన్‌ చాన్స్‌ కూడా మీనాక్షీకే లభించిందని టాలీవుడ్‌ లేటెస్ట్‌ సమాచారం. పాన్‌ ఇండియా ఫిల్మ్‌గా ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. నవంబరులో షూటింగ్‌ ప్రారంభం కానుందట.

మరిన్ని వార్తలు