ఐ లవ్‌ యూ.. తిరిగొచ్చేయ్‌: చిరంజీవి సర్జా భార్య

30 Apr, 2021 12:00 IST|Sakshi

దివంగత నటుడు చిరంజీవి సర్జా జ్ఞాపకాల సుడిగుండంలో నుంచి ఇప్పటికీ బయటకు రాలేకపోతోంది అతడి భార్య మేఘనా రాజ్‌. భర్త చనిపోయిన కొద్ది రోజులకే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆమె ఈఫిల్‌ టవర్‌ ముందు చిరుతో కలిసి దిగిన ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. 'ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను. తిరిగొచ్చేయ్‌..' అంటూ ఎమోషనల్‌ అయింది. ఇది చూసిన అభిమానులు నిజంగానే చిరు మళ్లీ వస్తే బాగుండు అని, కానీ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయి మనందరికీ తీరని అన్యాయం చేశాడని కామెంట్లు చేస్తున్నారు.

కాగా చిరంజీవి సర్జా గతేడాది జూన్‌ 7న గుండెపోటుతో బెంగళూరులో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో గర్భవతిగా ఉన్న మేఘనా రాజ్‌ అక్టోబర్‌లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అతడి చిరునవ్వులో, కళ్లలో, కదలికలో.. ఇలా అన్నింటిలోనూ తన భర్తను చూసుకుంటున్నానని పేర్కొంది. కాగా చిరంజీవి సర్జా 'వాయుపుత్ర' చిత్రంతో 2009లో కన్నడ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. సంహార, ఆద్య, ఖాకీ, సింగ, అమ్మా ఐ లవ్‌ యూ, ప్రేమ బరాహ, దండం దశగుణం, వరదనాయక వంటి పలు సినిమాల్లో నటనతో ఆకట్టుకున్నాడు. పదేళ్ల కెరీర్‌లో ఎన్నో విజయాలు అందుకున్నాడు. 

A post shared by Meghana Raj Sarja (@megsraj)

చదవండి: 
బర్త్‌డే పార్టీ!: మీ సోదరుడు చనిపోయాడు, గుర్తుందా?

భావోద్వేగం: కుమారుడిని ఎత్తుకున్న చిరు సర్జా!

మరిన్ని వార్తలు