అలాంటివంటే నాకు తెగ సిగ్గు: నటి

18 Jan, 2021 14:07 IST|Sakshi

బర్త్‌డే పార్టీలంటే మొహమాటం

2005లో 'యహాన్'‌ సినిమాతో చిత్రసీమలో తెరంగ్రేటం చేసింది మినీషా లంబా. పలు సినిమాలతో పాటు బుల్లితెర మీద కూడా సందడి చేసిన ఆమె నేడు 36వ పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఎంచక్కా నచ్చిన ప్రదేశంలో బర్త్‌డే జరుపుకోవచ్చు అనుకుంది కానీ కరోనా వల్ల ఆమె తన ప్లాన్లను రద్దు చేసుకుని ఇంటికే పరిమితమైంది. ఈ క్రమంలో ఆమె తన చిన్ననాటి జ్ఞాపకాలను, బాలీవుడ్‌లో తన ప్రయాణాన్ని ఓసారి నెమరు వేసుకుంది.

'ముందుగా నేను ఎదగడానికి దోహదపడ్డ నా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్తున్నా. ప్రతి బర్త్‌డే పార్టీకి నాకు బోలెడన్ని బహుమతులు వచ్చేవి. అప్పుడు అమ్మ ఎవరెవరు ఏమేం ఇచ్చారో వివరంగా రాసిపెట్టేది. ఎందుకంటే దాన్నిబట్టే కదా! మనం కూడా వాళ్ల పుట్టినరోజుకు గిఫ్ట్‌లు ఇవ్వాలి. నా చిన్నప్పుడు అయితే పుస్తకాలు, బట్టలు గిఫ్ట్‌ ఇస్తే అసలు నచ్చేదే కాదు. కానీ ఇప్పుడు పెద్దయ్యాక అవే బహుమతులు ఇతరులకు పంచుతుంటే సంతోషంగా ఉంటుంది. కాలం అన్నింటినీ మార్చేస్తుంది. ఇప్పటివరకు వచ్చిన బహుమతుల్లో నాకు అత్యంత విలువైనది ఈ బుక్‌ రీడర్‌. ఎందుకంటే దాన్ని నేను ఎంచక్కా ఎక్కడకు వెళ్లినా నా వెంట తీసుకువెళ్లొచ్చు. ఇక బాల్యంలో బర్త్‌డేలు అంటే తెగ సంబరపడేదాన్ని కానీ ఇప్పుడు మాత్రం సిగ్గేస్తుంది. పార్టీలో 50 మంది కన్నా ఎక్కువ ఉంటే నాకు అసలు సౌకర్యవంతంగానే అనిపించదు' అని పేర్కొంది. (చదవండి: ధనుష్‌తో మరోసారి జోడి కడుతున్న తమన్నా)

సినిమాల్లో అవకాశాలు...
'ఎందుకో తెలీట్లేదు కానీ కొన్నేళ్లుగా నాకు మంచి ఆఫర్లు రాడం లేదు. అయితే డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ వచ్చాక బోలెడంత స్పేస్‌ దొరికింది. కంటెంట్‌ బాగుంటే అందరూ ఆదరిస్తారు. నేను త్వరలో కుతుబ్‌ మినార్‌ చిత్రం ద్వారా మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేయనున్నాను. వేసవిలోగా ఈ చిత్రం ఓటీటీలో రిలీజవుతుంది' అని మినీషా చెప్పుకొచ్చింది. కాగా హిందీ బిగ్‌బాస్‌ ఎనిమిదో సీజన్‌లోనూ పాల్గొన్న మినీషా నటి పూజా బేడీ సోదరుడు రియాన్‌ను 2015లో వివాహం చేసుకుంది. కానీ తర్వాత ఏమైందో ఏమో కానీ 2020లో వీళ్లిద్దరూ విడిపోయారు. (చదవండి: ఎక్కడికో ఈ అడుగు)

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు