టీకా‌ తీసుకున్నా.. ప్రముఖ నటికి కరోనా

8 Apr, 2021 12:34 IST|Sakshi

కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ మొదలైంది. మరోసారి మహమ్మారి దేశంలో కోరలు చాస్తోంది. కోవిడ్‌ వ్యాక్సిన్‌ వచ్చినప్పటికి మహమ్మారి దాని ప్రతాపం చూపుతూ నిపుణులను, శాస్త్రవేత్తలను వెక్కిరిస్తోంది. కరోనా వ్యాక్సిన్‌ తీసుకుంటే మహమ్మారి దరి చేరదని.. అందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్‌ వేసుకోవాలంటూ పలు ఆరోగ్య సంస్థలు, సినీ ప్రముఖులు ప్రచారం చేస్తుంటే.. మరోవైపు టీకా తీసుకున్న వారు కరోనా పాజిటివ్‌గా రావడం ఆందోళన కల్గిస్తోంది.

తాజాగా ప్రముఖ నటి, కాంగ్రెస్‌ నేత నగ్మా సైతం కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విటర్‌లో ప్రకటించారు.  ఈ సందర్భంగా ఆమె ఏప్రిల్‌ 2వ తేదీన కరోనా ఫస్ట్‌ డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా వ్యాక్సిన్‌ తీసుకున్నప్పటికి ఆమె కరోనా సోకినట్లు స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం వైద్యుల సలహా మేరకు ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నట్లు ఆమె తెలిపింది. కాగా నగ్మా తెలుగు, తమిళ భాషల్లో ప్రముఖ హీరోల సరసన నటించి స్టార్‌ హీరోయిన్‌గా రాణించిన విషయం తెలిసిందే.

చదవండి: 
కరోనా టీకా రెండో డోస్‌ తీసుకున్న ప్రధాని మోదీ 
కరోనా విలయం: సోనూసూద్‌ అతిపెద్ద టీకా డ్రైవ్

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు