డ్యామెజ్‌ అయిన ‘శ్యామ్‌ సింగరాయ్‌’ సెట్‌!.. కోట్లలో నష్టం

21 May, 2021 17:59 IST|Sakshi

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. ‘టాక్సీవాలా’ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తుండగా,  కృతిశెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. ప్రస్తుతమున్న కరోనా పరిస్థితుల దృష్ట్యా ఈ సినిమా కోసమే హైదరాబాద్‌లో కోల్‌కత్తాని సృష్టించి భారీ సెట్‌ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆర్ట్‌ డైరెక్టర్‌ అవినాష్‌ కొల్ల కోల్‌కత్తాను తలపించే భారీ సెట్‌ను హైదరాబాద్‌లో సృష్టించారు. ఆరున్నర కోట్లతో పదెకరాల్లో ఈ సెట్‌ను నిర్మించారు.

ఫైనల్‌ షెడ్యూల్‌ షూటింగ్‌ జరుగుతుండగా లాక్‌డౌన్‌ కారణంగా షూట్‌ నిలిచిపోయింది. అయితే హైదరాబాద్‌లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు 'శ్యామ్ సింగ రాయ్' కోసం నిర్మించిన సెట్ డామేజ్ అయినట్లు సమాచారం. దీని వల్ల దాదాపు రెండు కోట్ల నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. దీంతో శ్యామ్‌ సింగరాయ్ నిర్మాతలకు అదనపు భారం పడనుందని టాక్‌ వినిపిస్తోంది. నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ ఎస్‌. బోయ‌న‌ప‌ల్లి నిర్మిస్తున్నారు. కోల్‌కత్తా బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాను ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.    

చదవండి : ఆ కారణంతోనే బాలీవుడ్‌ సినిమా చేయలేకపోతున్నా: నాని
హీరో సుధీర్‌బాబు భార్య పద్మిణి గురించి ఈ విషయాలు తెలుసా?

మరిన్ని వార్తలు