Anchor Ravi Trolls: ఫేక్‌ అకౌంట్లతో ట్రోలింగ్‌.. రవి భార్య ఆవేదన!

21 Nov, 2021 13:08 IST|Sakshi

Netizens Troll Bigg Boss Contestant Anchor Ravi Family With Fake Accounts: బిగ్ బాస్ ఇంట్లో యాంకర్ రవి మంచి స్ట్రాటజీలను ప్లే చేస్తూ స్ట్రాంగ్‌ కంటెంస్టెంట్‌ మారాడు. టాప్‌ 5లో రవి పక్కా ఉంటాడని షో ఫాలో అవుతున్నవారందనికి అర్థమవుతుంది. ముందు నుంచే యాంకర్‌ రవికి బిగ్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్నప్పటికీ, హౌస్‌లోకి వెళ్లాక..తనదైన ఆటతీరుతో మరింతమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రతివారం ఎలిమినేషన్‌లో ఉండడం కూడా రవికి కలిసొచ్చిందనే చెప్పాలి. నామినేషన్‌ ఒత్తిడిని దిగమింగుకొని గేమ్‌ను గేమ్‌లా ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడు. అందుకే ఇప్పటికే ఆయన హౌస్‌లో ఉన్నాడు.

ఇక ఇలాంటి రియాల్టీ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్‌పై ట్రోలింగ్‌ అనేది సహజమే. కొంతమంది తమకు నచ్చిన కంటెస్టెంట్‌ని పొగుడుతూ.. ప్రత్యర్థులను తిడుతుంటారు. అయితే దానికి ఓ కారణం, సందర్భం ఉంటేనే ఫ్యాన్స్‌ ఇతరులను ట్రోలింగ్‌ చేస్తుంటారు. కానీ యాంకర్‌ రవి విషయంలో మాత్రం అందుకు విరుద్దంగా జరుగుతుంది. కొంత‌మంది ర‌విని అకార‌ణంగా ట్రోల్‌ చేయ‌డం మొద‌లెట్టారు. సోష‌ల్ మీడియాలో కొంత‌మంది ఫేక్ అకౌంట్లు సృష్టించి, ర‌విని, వాళ్ల కుటుంబ స‌భ్యుల్ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారని రవి సన్నిహితులు చెబుతున్నారు. రియాల్టీ షోలో కంటెస్టెంట్‌గా ఉన్నాడు కాబట్టి..అతన్ని తిట్టినా, పొగిడినా పర్లేదు.. కానీ అతని కుటుంబ సభ్యులను కూడా ట్రోల్స్‌ చేయడం దారుణమనే చెప్పాలి. ‘కావాలనే కొంతమంది నా పేరును, నా కూతురిను ఈ ట్రోల్స్‌లోకి తీసుకొస్తున్నారు’అని రవి భార్య నిత్య ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇది గేమ్‌ స్పిరిట్‌ కాదని, తమకు ఎందుకు ట్రోల్‌ చేస్తున్నారో అర్థం కావట్లేదని సన్నిహితుల దగ్గర వాపోయింది.

వాస్తవానికి బిగ్‌బాస్‌ లాంటి రియాల్టీ షోలోకి వెళ్లే కంటెస్టెంట్స్‌ ముందే ఓ గట్టి పీఆర్‌ టీమ్‌ని ఏర్పాటు చేసుకుంటుంది. వాళ్లు హౌస్‌లో ఉంటే బయట పీఆర్‌ టీమ్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం చేస్తుంది. అయితే తమ కంటెస్టెంట్స్‌ని పొగుడుతూ ప్రచారం చేస్తే బాగుంటుంది కానీ...తమవారిని హైలెట్‌ చేయడం కోసం ఇతరులను ట్రోల్‌ చేయడం సరికాదు. దాని వల్ల తమ సభ్యుడు ఎలివేట్ అవుతామ‌నుకోవ‌డం పొర‌పాటు.

మరిన్ని వార్తలు