To Kill a Tiger Movie: హృదయాలను మెలిపెట్టే సినిమా.. సడన్‌గా ఓటీటీలోకి.. స్ట్రీమింగ్‌ అక్కడే!

10 Mar, 2024 17:39 IST|Sakshi

ఆస్కార్‌ వేడుకలకు రంగం సిద్ధమైంది. రేపు ఉదయం 96వ అకాడమీ అవార్డు సెలబ్రేషన్స్‌ జరగనున్నాయి. భారత్‌కు చెందిన అమ్మాయి నిషా పహుజా తెరకెక్కించిన టు కిల్‌ ఎ టైగర్‌ అనే చిత్రం డాక్యుమెంటరీ ఫీచర్‌ కేటగిరీలో నామినేషన్‌ దక్కించుకుంది. ఆస్కార్‌ పురస్కారాల ప్రకటనకు ఒకరోజు ముందు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో నేటి నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది.

కథేంటంటే.. 
13 ఏళ్ల వయసు చిన్నారి నిషాకు చదువు, ఆటలు తప్ప మరొకటి తెలియదు. అన్యం పుణ్యం తెలియని ఆ పల్లెటూరి అమాయకురాలిపై కీచకులు సామూహిక అత్యాచారానికి పాల్పడతారు. ఈ ఘటనతో పాప భవిష్యత్తు అంధకారంగా మారుతుంది. కానీ తల్లిదండ్రులు ఏడుస్తూ కూర్చోలేదు. న్యాయం కోసం పోరాటం మొదలుపెడతారు. ఇది సినిమానే కాదు రియల్‌గానూ జరిగింది. 2017లో జార్ఖండ్‌లోని రాంచీలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా తీశారు. భారత సంతతికి చెందిన కెనడావాసి నిషా పహుజా అద్భుతంగా తెరకెక్కించింది. 

ఓటీటీలో..
ఈ సినిమా ఇప్పటికే టోర్నటో ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌లోనూ సత్తా చాటింది. అమెరికాలో ఈ సినిమా థియేటర్లలో రిలీజవగా ఇండియాలో మాత్రం థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజైంది. నేషనల్‌ ఫిలిం బోర్డ్‌ ఆఫ్‌ కెనడా వెబ్‌సైట్‌లోనూ దీన్ని ఫ్రీగా చూసేయొచ్చు. మరింకెందుకు ఆలస్యం.. హృదయాన్ని మెలిపెట్టే ఈ సినిమానూ మీరూ చూసేయండి..

చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన మూవీ.. కాకపోతే..

Election 2024

మరిన్ని వార్తలు