టీజర్‌ ఆసక్తికరంగా ఉంది

18 Dec, 2020 06:14 IST|Sakshi
త్రివిక్రమ్‌, సూర్య వశిష్ట

– త్రివిక్రమ్‌

శ్రీనివాస్‌ రెడ్డి, సూర్య వశిష్ట హీరోలుగా, డింఫుల్‌ హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం ‘ప్లాన్‌ బి’. కేవీ రాజమహి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ఏవీఆర్‌ నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ను త్రివిక్రమ్‌ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘టీజర్‌ చాలా క్యూరియాసిటీ నింపింది. సినిమా పెద్ద సక్సెస్‌ అయి అందరికీ పేరు రావాలనుకుంటున్నాను’’ అన్నారు. ‘‘నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతకు ధన్యవాదాలు. సస్పెన్స్, క్రైమ్‌ థిల్లర్‌గా రూపొందించాం. కునాల్‌ శర్మ విలన్‌గా చేశారు’’ అన్నారు రాజమహి. ‘‘షూటింగ్‌ పూర్తయింది. అనుకున్నదానికంటే బాగా వచ్చింది. మా టీజర్‌ని విడుదల చేసిన త్రివిక్రమ్‌గారికి ధన్యవాదాలు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు చివర్లో ఉన్నాయి’’ అన్నారు నిర్మాత ఏవీఆర్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు