రాశీఖన్నా కెరీర్‌లోనే తొలిసారిగా అలాంటి పాత్రలో..

18 Dec, 2021 08:25 IST|Sakshi

Raashi Khanna First Ever Horror Comedy Film Aranmanai All Set To Release:సుందర్‌ సి, ఆర్య, రాశీ ఖన్నా, ఆండ్రియా హీరో హీరోయిన్లుగా నటించిన తమిళ చిత్రం ‘అరణ్మణై 3’.  సుందర్‌ సి. దర్శకత్వం వహించారు. ఉదయనిధి స్టాలిన్, ఎ.సి.ఎస్‌. అరుణ్‌ కుమార్, ఖుష్బూ సమర్పణలో రూపొందిన ఈ చిత్రం ‘అంతఃపురం’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ఈ నెల 31న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఈ సందర్భంగా సుందర్‌ సి. మాట్లాడుతూ– ‘‘రాశీ ఖన్నా నటించిన తొలి హారర్‌ కామెడీ సినిమా ‘అంతఃపురం’. తెలుగులో ‘చంద్రకళ’గా వచ్చిన ‘అరణ్మణై’, ‘కళావతి’గా విడుదలైన ‘అరణ్మణై 2’ సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ‘అరణ్మణై 3’కి తమిళంలో మంచి స్పందన రావడంతో  ‘అంతఃపురం’ పై తెలుగులోనూ అంచనాలున్నాయి. ప్రీ రిలీజ్‌ ఫంక్షన్, ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అన్నారు. సాక్షీ అగర్వాల్, వివేక్, యోగిబాబు, మనోబాల నటించిన ఈ చిత్రానికి కెమెరా:యు.కె. సెంథిల్‌ కుమార్, సంగీతం: సత్యసి. 

మరిన్ని వార్తలు