ఆస్ప‌త్రి పాలైన బాలీవుడ్ న‌టుడు

29 Nov, 2020 20:28 IST|Sakshi

'ఎల్ఏసీ' సినిమా చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటున్న బాలీవుడ్ న‌టుడు రాహుల్ రాయ్‌కు బ్రెయిన్ స్ట్రోక్‌కు గుర‌య్యారు. కార్గిల్‌లో ఉన్న వాతావ‌ర‌ణం కార‌ణంగా ఆయ‌న‌కు బ్రెయిన్ స్ట్రోక్ రావ‌డంతో వెంట‌నే షూటింగ్ నిలిపివేసి రెండు రోజుల క్రితం ముంబైకి వచ్చారు. ఈ విష‌యాన్ని రాహుల్ రాయ్ సోద‌రుడు రోమీర్ సేన్ ఆల‌స్యంగా మీడియాకు తెలిపారు. రాహుల్ ప్ర‌స్తుతం ఐసీయూలో ఉన్నాడ‌ని, అయితే ఎవ‌రూ భ‌య‌ప‌డాల్సిన ప‌ని లేద‌ని పేర్కొన్నారు. ఇప్పుడిప్పుడే ఆయ‌న‌ కోలుకుంటున్నార‌ని చెప్పారు. కోవిడ్ ప‌రీక్ష‌లు చేయ‌గా నెగెటివ్ వ‌చ్చింద‌న్నారు. (చ‌ద‌వండి: రియాలిటీ షో: వారిద్దరూ కలిసుండటం లేదా!)

రాహుల్‌ రాయ్..‌ 'ఆషిఖి' సినిమాతో 22 ఏళ్ల‌కే బాలీవుడ్‌లో తెరంగ్రేటం చేశారు. మొద‌టి సినిమాతోనే మ్యూజిక‌ల్‌ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్నారు. త‌ర్వాత ప‌లు సినిమాల్లో త‌న ప్ర‌తిభ చూపించారు. 2006లో హిందీ బిగ్‌బాస్ మొద‌టి సీజ‌న్ టైటిల్‌ను సైతం ఆయ‌న కైవ‌సం చేసుకున్నారు. ప‌లు టీవీ షోల‌లోనూ ప్ర‌త్యేక అతిథిగా క‌నిపించి ఆక‌ట్టుకున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న 'ఎల్ఏసీ- లైవ్ ద బాటిల్ ఇన్ కార్గిల్' సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. (చ‌ద‌వండి: 26/11 విషాదం.. ‘మీ జ్ఞాపకాలే నా బలం’)

మరిన్ని వార్తలు