-->

‘రంగస్థలం’ కాంబినేషన్‌ రిపీట్‌

22 Mar, 2024 04:55 IST|Sakshi

‘రంగస్థలం’ కాంబినేషన్‌ రిపీట్‌ కానుందని టాక్‌. హీరో రామ్‌చరణ్, దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందిన బ్లాక్‌ బస్టర్‌ ఫిల్మ్‌ ‘రంగస్థలం’ (2018). కాగా రామ్‌చరణ్, సుకుమార్‌ కాంబినేషన్‌లో మరో సినిమాకు సన్నాహాలు మొదలయ్యాయట. ఈ నెల 27న రామ్‌చరణ్‌ బర్త్‌ డే సందర్భంగా ఈ సినిమా గురించిన అధికారిక  ప్రకటన వెల్లడి కానుందని తెలిసింది.

‘రంగస్థలం’ సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందని, దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ అందిస్తారని భోగట్టా. చరణ్‌ సినిమాలో సంజయ్‌ దత్‌? రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌. నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించనున్న ఈ సినిమాలో కన్నడ స్టార్‌ శివ రాజ్‌కుమార్‌ ఓ కీలక పాత్ర చేయనున్నారు. అలాగే బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ ఓ కీలక పాత్రలో కనిపిస్తారనే టాక్‌ తెరపైకి వచ్చింది. ఇక హిందీలో రామ్‌చరణ్‌ చేసిన తొలి చిత్రం ‘తుఫాన్‌’లో సంజయ్‌ దత్‌ ఓ రోల్‌ చేశారు. మరి.. రామ్‌చరణ్, సంజయ్‌ దత్‌ మళ్లీ స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటారా? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.

Election 2024

మరిన్ని వార్తలు