RGV Kondaa Movie: ఆర్జీవీ 'కొండా' ట్రైలర్‌ విడుదల.. సినిమా రిలీజ్‌ ఎప్పుడంటే ?

3 Jun, 2022 13:56 IST|Sakshi

Ram Gopal Varma Konda Movie Second Trailer Released: డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘కొండా’. తెలంగాణ రాజకీయాల్లో తమకంటూ ఒక ప్రత్యేకతని సాధించిన కొండా మురళీ, సురేఖల జీవిత నేపథ్యం ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించాడు వర్మ. ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో అదిత్‌ అరుణ్‌, ఐరా మోర్‌, పృథ్వీరాజ్‌ నటించారు. ఇదివరకు ఈ సినిమా మొదటి ట్రైలర్‌ను రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26నల విడుదల చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా తాజాగా శుక్రవారం (జూన్‌ 3) రెండో ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు.  

1990లో కారుపై జరిగిన కాల్పుల సన్నివేశంతో ట్రైలర్‌ ప్రారంభమైంది. పెత్తందార్ల పెత్తనం భరించలేక కొంతమంది బడుగు వర్గాలు తిరగబడి మొత్తం వ్యవస్థతోనే పోరాడుతున్న రోజులవి అంటూ ఆర్జీవీ చెప్పే డైలాగ్‌ ఇంటెన్సిటీని క్రియేట్‌ చేసింది. 'విపరీత పరిస్థితుల నుంచే విపరీత వ్యక్తులు ఉద్భవిస్తారని కార్ల్‌ మార్క్స్‌ 180 ఏళ్ల క్రితం  చెప్పారు. అలాంటి విపరీత పరిస్థితుల మధ్య నుంచే పుట్టిన వ్యక్తి కొండా మురళీ' అంటూ మొదటి ట్రైలర్‌లాగానే హీరో పాత్రను పరిచయం చేశారు. ఈసారి కొట్టా, చంపేస్తా, ఆలోచనలు ఉంటే సరిపోదు స్వేచ్ఛ, బానిసత్వం, మనం చేసే పోరాటల గురించి కూడా తెల్వాలే అనే డైలాగ్‌లు, యాక్షన్‌, లవ్ సన్నివేశాలతో ట్రైలర్‌ ఆకట్టుకునేలా ఉంది. అలాగే ఈ సినిమాను జూన్‌ 23న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. 

చదవండి: ‘కొండా’ సినిమా: పొలిటీషియన్‌కి ఆర్జీవీ ఇండైరెక్ట్‌ వార్నింగ్‌
కమల్‌ హాసన్‌ 'విక్రమ్' మూవీ ట్విటర్‌ రివ్యూ..

మరిన్ని వార్తలు