RAM: ఓటీటీలోకి వచ్చేసిన దేశ భక్తి చిత్రం ‘రామ్‌’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..?

26 Mar, 2024 19:03 IST|Sakshi

సూర్య అయ్యలసోమయాజుల, ధన్యా బాలకృష్ణ జంటగా నటించిన తాజా దేశ భక్తి చిత్రం  రామ్ (ర్యాపిడ్ యాక్షన్ మిషన్) . రిపబ్లిక్ డే సందర్భంగా ఈ ఏడాది జనవరి 16న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ని సంపాదించుకుంది. దర్శకుడు మిహిరామ్ వైనతేయకి ఇది తొలి సినిమానే అయినా.. మంచి పేరును తీసుకొచ్చింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది. 

‘రామ్‌’ కథేంటి?
హైద్రాబాద్‌లోని హెచ్ ఐ డీ (హిందుస్థాన్ ఇంట్రా డిఫెన్) హెడ్డుగా రియాజ్ అహ్మద్ (సాయి కుమార్) వ్యవహరిస్తుంటారు. ఆ డిపార్ట్మెంట్‌లో జేబీ (భాను చందర్) చురుకైన ఆఫీసర్. గతంలో జేబీ పని చేసిన జట్టు ఓ మిషన్‌‌ కోసం వెళ్తుంది. అందులో జేబీపై అధికారి మేజర్ సూర్య ప్రకాష్ (రోహిత్) ప్రాణాలు కోల్పోతాడు. తమ కోసం ప్రాణాలు అర్పించిన అధికారి కొడుకు రామ్ (సూర్య అయ్యలసోమయాజుల)ను డిపార్ట్మెంట్‌లోకి తీసుకు రావాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ రామ్ మాత్రం అల్లరి చిల్లరి జాలీగా తిరుగుతూ తాగుతూ ఎంజాయ్ చేస్తుంటాడు.

అలాంటి రామ్ తొలి చూపులోనే జాహ్నవి (ధన్య బాలకృష్ణ) ప్రేమలో పడిపోతాడు. ఆ అమ్మాయి జేబీ కూతురే. మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే డిపార్ట్మెంట్‌లో జాయిన్ అవ్వాలనే కండీషన్ పెడతాడు జేబీ. అమ్మాయి ప్రేమ కోసం రామ్ డిపార్ట్మెంట్‌లో చేరేందుకు పడిన కష్టం ఏంటి? అదే టైంలో ఉగ్రవాదులు ఎలాంటి కుట్రలు పన్నుతుంటారు? దాన్ని అడ్డుకునేందుకు హీరో ఏం చేస్తాడు? అసలు ఈ కథలో ర్యాపిడ్ యాక్షన్ మిషన్ మీనింగ్ ఏంటి? అన్నది తెరపై చూడాల్సిందే.

Election 2024

మరిన్ని వార్తలు