ప్రముఖ సింగర్‌పై యువతుల అక్రమ రవాణా ఆరోపణలు

26 Mar, 2024 11:47 IST|Sakshi

అమెరికన్  ప్ర‌ముఖ ర్యాప‌ర్ డిడ్డీ (54) అమ్మాయిల ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్నాడని న్యూయార్క్‌లోని ఫెడరల్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  ర్యాప‌ర్ అసలు పేరు సీన్ కాంబ్స్.. కాగా డిడ్డీగా సుప్ర‌సిద్ధుడు. పలువురు ఫిర్యాదులు చేయడంతో  లాస్ ఏంజిల్స్, మయామిలోని  ర్యాపర్‌ డిడ్డీకి చెందిన రెండు నివాసాలను ఫెడరల్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ ఏజెంట్లు శోధించారు. ఆ వివరాలను అక్కడి అధికారులు బహిరంగంగా చర్చించడానికి ముందుకు రాలేదు.

త‌న ప్ర‌తిభ‌తో గ్రామీ అవార్డులను సొంతం చేసుకుని మ్యూజిక్ మొఘ‌ల్ గా కీర్తిని అందుకున్నాడు. కానీ కొన్ని నెలల క్రితం ఓ యువ‌తి వేసిన దావాలో డిడ్డీపై అత్యాచారం, కిడ్నాప్, మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల దుర్వినియోగం, బహిరంగ అసభ్యత వంటి అభియోగాలు ఉన్నాయి. ఎవరు ఈ కేసు వేశారు? ఎవ‌రు ఈ అభియోగాలు నమోదు చేశారు? అనే దానిపై అక్కడి ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. దీని వెనుక అతడి మాజీ ప్రియురాలు కాసాండ్రా వెంచురా ఉన్నట్లు సమాచారం.

54 ఏళ్ల రాపర్ డిడ్డీపై మరో ఐదుగురు మహిళలు కూడా తాజాగా అత్యాచారం, లైంగిక వేధింపులు వంటి ఆరోపణలు చేశారు. శృంగారం సమయంలో అందుకు సంబంధించిన వీడియోలను తన స్నేహితులకు కూడా చూపించే వాడని వారు పేర్కొన్నారు. తన స్నేహితుల వద్దకు పలువురి అమ్మాయిలను కూడా పంపుతాడని అక్కడి అధికారులకు సమాచారం అందింది. ఇలాంటి కార్యక్రమాలన్నీ ఆయన ఇంట్లోనే జరుగుతాయని పలు ఫిర్యాదులు రావడంతో డిడ్డీ ఇంట్లో శోధించి పలువురిని అరెస్ట్‌ చేశారు. ఆ సమయంలో డిడ్డీ ఇంట్లో లేరని తెలుస్తోంది.

2016లో డిడ్డీ త‌న ప్రియురాలు కాసాండ్రా వెంచురా నుంచి బ్రేక‌ప్ అయ్యాడు. కానీ ఆ సమయంలో ఆమె డిడ్డీపై పలు ఆరోపణలు చేసింది. తనపై అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసింది. తనను తీవ్రంగా హింసించాడని పేర్కొంది. అత్యాచారం- దాడి -మానవ అక్రమ రవాణా స‌హా చాలా కేసులు కూడా ఆ సమయంలో పెట్టింది. పురుష వేశ్యలతో లైంగిక సంబంధం పెట్టుకోమని డిడ్డీ బలవంతం చేశాడని కూడా కాసాండ్రా ఆరోపించింది.

Election 2024

మరిన్ని వార్తలు

Greenmarkdevelopers