మహేశ్‌ హీరోయిన్స్‌ మాస్‌ ఇమేజ్‌ పక్కా, అప్పుడు రష్మిక, ఇప్పుడు కీర్తి

13 May, 2022 17:00 IST|Sakshi

సూపర్ స్టార్‌ మహేశ్‌ బాబు  సినిమాలో చాన్స్ అంటే హీరోయిన్స్ కెరీర్ లో మరో మైల్ స్టోన్ మూవీ అన్నట్లే లెక్క. పైగా ఈ మధ్య కాలంలో సూపర్ స్టార్ మూవీలో కనిపించే హీరోయిన్స్ కు మాస్ ఇమేజ్ వచ్చేస్తోంది. వినడానికి విచిత్రంగా ఉన్న ఇదే నిజం. అంతకు ముందు రష్మిక, ఇప్పుడు  కీర్తిసురేశ్‌..ఇద్దరికి సరికొత్త ఇమేజ్‌ వచ్చేసింది.

సరిలేరు నీకెవ్వరు మూవీ వరకు రష్మిక ఇమేజ్ వేరు..ఆ తర్వాత ఆమె అందుకున్న ఇమేజ్ వేరు. అప్పటి వరకు క్యూట్ గా స్వీట్ గా కనిపిస్తూ వచ్చిన రష్మిక, సరిలేరు నీకెవ్వరులో మైండ్ బ్లాక్ సాంగ్ తో ఒక్క సారీగా మాస్ ఇమేజ్ అందుకుంది. మైండ్ బ్లాక్ సాంగ్ లో రష్మిక లుక్ వేసిన స్టెప్స్ ఆమెకు మరింతగా మాస్ ఇమేజ్ తీసుకొచ్చాయి. పుష్పలో అల్ట్రా మాస్ క్యారెక్టర్ శ్రీవల్లి పాత్రలో నటించేందుకు కాన్ఫిడెన్స్ అందించాయి.

మహానటితో గొప్ప నటిగా పేరు తెచ్చుకుంది కీర్తిసురేశ్‌. ఆ తర్వాత అలాంటి సీరియస్ పాత్రల్లోనే ఎక్కువగా కనిపిస్తూ వచ్చింది. కాని సర్కారు వారి పాటలో మ.. మ.. మహేషా సాంగ్ తో కీర్తి  వేసిన స్టెప్పులు చూసి ఆమె ఫ్యాన్స్ షాక్ అయ్యారు. మహానటి వేసిన మాస్ మూవ్ కు ఫిదా అయ్యారు. 

సర్కారు వారి పాటతో అందివచ్చిన మాస్ ఇమేజ్ ను కీర్తీ సురేష్ కంటిన్యూ చేయాలనుకుంటోంది.నేచురల్ స్టార్ నానితో కలసి నటించబోయే కొత్త సినిమా ‘దసరా’లో మరో సారి మాస్ క్యారెక్టర్ తో సర్ ప్రైజ్ చేస్తానంటోంది.

మరిన్ని వార్తలు