నమ్మాం.. హిట్‌ టాక్‌ వచ్చింది : నటుడు

22 May, 2022 10:40 IST|Sakshi

రవీంద్ర రెడ్డి, వినయ పాణిగ్రాహి, త్రినాథ్‌ వర్మ,  భావన సాగి, స్వాతి మండాది ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘ధ్వని’. నాగ దుర్గారావు సానా దర్శకత్వంలో పరమకృష్ణ, సాధన నన్నపనేని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదలైంది. సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోందని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో దర్శకుడు దుర్గారావు మాట్లాడుతూ – ‘‘ధ్వని’ సినిమాను సక్సెస్‌ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు.

బాగా యాక్ట్‌ చేసిన ఆర్టిస్టులు, కష్టపడ్డ సాంకేతిక నిపుణులకు ప్రత్యేక ధన్యవాదాలు. నిర్మాతలు రాజీ పడకుండా నిర్మించారు’’ అన్నారు. ‘‘ధ్వని సినిమా విడుదలై మంచి టాక్‌తో ముందుకెళుతోంది. సినిమాకు రెస్పాన్స్‌ రావడంతో స్క్రీన్స్‌ పెంచాం. సినిమాకు ప్రేక్షకులు ఇచ్చిన పెద్ద సపోర్ట్‌ ఇది. ఈ సక్సెస్‌ మా కష్టాన్ని మరచిపోయేలా చేసింది. మేము సినిమా కంటెంట్‌ను నమ్మి విడుదల చేశాం. అందుకు తగ్గట్టుగానే బాగా ఆడుతోంది’’ అన్నారు రవీంద్ర రెడ్డి. 

మరిన్ని వార్తలు