RGV Shapadham OTT Streaming: అందరికీ అందుబాటులో 'శపథం'.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం: వర్మ

9 Mar, 2024 17:24 IST|Sakshi

టాలీవుడ్‌ సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ డైరెక్ట్‌ చేసిన వ్యూహం సినిమా ఇప్పటికే విడుదలైంది. దానికి సీక్వెల్‌ అయిన శపథం విడుదల కావాల్సి ఉంది.  వ్యూహం సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసిన వర్మ.. ఆ సినిమాకు సంబంధించి శపథంను వెబ్ సిరీస్ రూపంలో ఓటీటీలో రిలీజ్‌ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా విషయంలో వర్మ ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. 'శపథం సినిమాను ఇప్పటికే ఏపీలో ఫైబర్ నెట్‌లో విడుదల చేశాం. మరో రెండు మూడు రోజుల్లో అన్ని ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లలో అందుబాటులో ఉంటుంది.  వ్యూహం, శపథం సినిమాలు చేస్తున్నప్పుడే వాటికి వెబ్ సిరీస్ కూడా తీశాం. అందరికీ సినిమా  రిచ్ అవ్వాలని మా ప్రయత్నం. ఏపీ రాజకీయాల్లో నాలుగు గోడల మధ్య జరిగిన కొన్ని సంఘటనలరు ప్రజలకు చూపించాను. నాకు పబ్లిక్ ఫిగర్స్ మీద ఉన్న అభిప్రాయాన్ని సినిమాగా తీశాను.' అని ఆయన చెప్పారు.

వెబ్ సిరీస్‌కు శపథం ఆరంభం ఛాప్టర్-1, శపథం ఆరంభం ఛాప్టర్-2 అనే టైటిల్స్ పెట్టారు వర్. ఎలాంటి కట్స్ లేకుండా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సమాచారం. కొన్ని నిబంధనలు, కోర్టు కేసులు, అభ్యంతరాలు ఉంటాయి కాబట్టి, వాటికి తగ్గట్టు వ్యూహంను థియేటర్లలో రిలీజ్ చేశామని చెప్పిన వర్మ శపథం మాత్రం ఇలా ఓటీటీలో విడుదల చేయడంతో ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఏపీలో ఫైబర్‌ నెట్‌లో శపథం చిత్రాన్ని చూడవచ్చు. 

శపథం సినిమా గురించి ఆ చిత్ర నిర్మాత దాసరి కిరణ్‌ కుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టీడీపీ వాళ్లు సినిమాని ఎవ్వరు చూడకుండా పలు కుట్రలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ క్రమంలో గ్రామాల్లో ఉన్న కేబుల్స్‌ను వారు కట్ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ అంశం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశామని వారు విచారణ చేపట్టారని ఆయన చెప్పుకొచ్చారు. థియేటర్‌లో విడుదల కావాల్సిన శపథం సినిమా ఇంకా సెన్సార్ కాలేదని ఆయన తెలిపారు. కానీ అందరూ సినిమా చూడాలని ఉద్దేశంతో ఈ చిత్రాన్ని నిర్మించాం. అందుకే సెన్సార్ కాకపోయిన ఫైబర్ నెట్ ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

Election 2024

మరిన్ని వార్తలు