Salaar Movie: హిట్ సినిమా నష్టాలొచ్చాయి? అసలేం జరిగింది?

12 Mar, 2024 11:56 IST|Sakshi

డార్లింగ్ ప్రభాస్ 'సలార్'.. బాక్సాఫీస్ దగ్గర ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రిలీజ్ వరకు చాలామంది సందేహపడ్డారు. కానీ థియేటర్లలోక వచ్చిన తర్వాత వసూళ్ల మోత మోగించింది. అలాంటి ఈ సినిమా వల్ల కొందరు డిస్ట్రిబ్యూటర్స్‌కి నష్టాలొచ్చాయట. ఇప్పుడిదే ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిపోయింది.

(ఇదీ చదవండి: ఎట్టకేలకు బయటకొచ్చిన అనుష్క.. ఇంతలా మారిపోయిందేంటి!?)

'కేజీఎఫ్' లాంట ఊరమాస్ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ప్రభాస్‌తో సినిమా చేస్తున్నాడనేసరికి అందరూ అంచనాలు పెంచుకున్నారు. ఇందుకు తగ్గట్లే బిజినెస్ కూడా జరిగింది. నైజాం హక్కుల్ని దక్కించుకున్న మైత్రీ మూవీ మేకర్స్.. మంచి లాభాల్ని కూడా చూసింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో కొందరు డిస్ట్రిబ్యూటర్స్ 'సలార్' రైట్స్‌ని ఎక్కువ ధరకి కొనడం కొంపముంచిందట.

పెట్టిన పెట్టుబడి తగ్గట్లు ఆయా ప్రాంతాల్లో వసూలు కాలేదని, దీంతో 'సలార్' నిర్మాత విజయ్ కిరగందూర్.. సదరు డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోయిన మొత్తాన్ని తాజాగా తిరిగిచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు 'సలార్' సీక్వెల్ 'శౌర్యంగపర్వం' షూటింగ్ జూన్ నెల నుంచి మొదలయ్యేలా కనిపిస్తుంది. ఒకవేళ అన్ని అనుకున్నట్లు జరిగితే 'సలార్' రెండో పార్ట్.. వచ్చే ఏడాది థియేటర్లలో రావడం గ్యారంటీ.

(ఇదీ చదవండి: ప్రభాస్ డూప్‌కి షాకింగ్ రెమ్యునరేషన్.. ఒక్కో సినిమాకు ఎంతంటే?)

Election 2024

మరిన్ని వార్తలు

Greenmarkdevelopers