యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ‘సీటీమార్‌’

4 Mar, 2021 09:15 IST|Sakshi

గోపీచంద్, తమన్నా జంటగా భూమిక కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సీటీమార్‌’. సంపత్‌ నంది దర్శకత్వం వహిస్తున్నారు. పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘గెలుపు సూరీడు చుట్టూ తిరిగేటి ప్రొద్దు తిరుగుడు పువ్వా...’ అంటూ సాగే టైటిల్‌ సాంగ్‌ని సమంత విడుదల చేసి, టీమ్‌కి ఆల్‌ ది బెస్ట్‌ తెలిపారు. ఈ పాటకు కాసర్ల శ్యామ్‌ సాహిత్యం అందించగా అనురాగ్‌ కులకర్ణి, రేవంత్, వరం ఆలపించారు.

‘‘మాస్‌ గేమ్‌ కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న భారీ స్పోర్ట్స్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సీటీమార్‌’. గోపీచంద్‌  కెరీర్‌లోనే భారీ బడ్జెట్, హై టెక్నికల్‌ వాల్యూస్‌తో రూపొందుతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కి, టైటిల్‌ సాంగ్‌కి మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. దిగంగనా సూర్యవంశీ, పోసాని కృష్ణమురళి, రావు రమేష్, రెహమాన్, తరుణ్‌ అరోరా ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో అప్సరా రాణి స్పెషల్‌ సాంగ్‌లో నటించారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్‌. సౌందర్‌ రాజన్, సంగీతం: మణిశర్మ, సమర్పణ: పవన్‌ కుమార్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు