Samantha : సమంత జాతకాలను నమ్ముతుందా? అందుకే రంగురాళ్లను ధరించిందా?

11 Nov, 2022 13:13 IST|Sakshi

స్టార్‌ హీరోయిన్‌ సమంత నటించిన ఉమెన్‌ సెంట్రిక్‌ మూవీ యశోద. ఈ సినిమా నేడు(శుక్రవారం)ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఆరోగ్యం బాలేకపోయినా ఆమెయశోద ప్రమోషన్స్‌లో పాల్గొంది. ఈ క్రమంలో సమంత చేతికి ధరించిన ఉంగరాళ్లపై ప్రత్యేకంగా దృష్టి పడింది. ఎప్పుడూ డిజైనర్‌ వేర్‌ జ్యువెలరీలో కనిపించే సామ్‌ తొలిసారిగా ఇలా జాతకాల ప్రకారం రంగురాళ్లను ధరించడం ఆసక్తికరంగా మారింది. 

ప్రస్తుతం శారీరకంగా, మానసికంగా భాదపడుతున్న సమంత 'మయోసైటిస్‌' అనే వ్యాధితో పోరాడుతున్న సంగతి తెలిసిందే. గత కొన్నాళ్లుగా తన జీవితంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా సమంత ఈమధ్యకాలంలో జాతకాలను కూడా నమ్ముతున్నట్లు తెలుస్తుంది. అందుకే ఆమె చేతికి రంగురాళ్లను ధరించనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమె ధరించిన ఉంగరాల్లో ఒకటి కనకపుష్యరాగం ఒకటి. ఇది సంపద, ఆరోగ్యానికి శుభసూచికంగా భావిస్తారట.

దీంతో పాటు ఆమె గోమేధకం అనే మరో ఉంగరాన్ని కూడా ధరించింది. ఇది చెడు దృష్టి నుంచి కాపాడుతుందట. దీన్ని ధరించిన వారికి శారీరకంగా, మానసికంగా సత్పలితాలు ఉంటాయట. ఇక సమంత ధరించిన మరో ఉంగరం ముత్యం.. ఇది చంద్రుడు ఒక్కో క్షణంలో బలహీనంగా మారినపుడు ఆ ప్రభావం మన ఆరోగ్యం పై పడకుండా ఉండేలా ఈ ఉంగరాన్ని ధరిస్తారట. మొత్తానికి దీన్ని బట్టి సమంత సెంటిమెంట్లను బాగానే ఫాలో అవుతుందనే టాక్‌ వినిపిస్తుంది.  

మరిన్ని వార్తలు