సినిమాల కన్నా స్మాల్‌ స్క్రీన్‌ మీదే..

26 Jul, 2020 06:36 IST|Sakshi

సప్న పబ్బి.. సినిమా ప్రేక్షకుల కన్నా  బుల్లి తెర వీక్షకులకు బాగా పరిచయం ఉన్న ఆర్టిస్ట్‌. ఈ మోడల్‌గా కెరీర్‌ మొదలుపెట్టి నటిగా స్థిరపడింది. లండన్‌లో స్థిరపడ్డ పంజాబీ కుటుంబం వీళ్లది. సప్న పుట్టింది, పెరిగింది అక్కడే. బర్మింగ్‌హామ్‌లోని అస్టన్‌ యూనివర్సిటీలో డిగ్రీ చదివింది.  మోడలింగ్‌లో అవకాశాలు రావడంతో ముంబైకి షిఫ్ట్‌ అయింది. 

ఫస్ట్‌ స్క్రీన్‌ అపియరెన్స్‌..  ‘ఘర్‌ ఆజా పర్‌దేశీ’ అనే టీవీ సీరియల్‌తో. ఇందులో నటిస్తున్నప్పుడే ‘24’ అనే సిరీస్‌లో అవకాశం వచ్చింది.  రెండు సీజన్స్‌లో నటించింది సప్న..  బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కపూర్‌కి కూతురుగా.  

ఖామోషియా... సప్న మొదటి సినిమా. హ్యాపీ బిగినింగ్‌ ఇచ్చిన సినిమా ఏం కాదిది ఆమెకు. కొన్ని సీన్ల చిత్రీకరణలో దర్శకుడు విక్రమ్‌ భట్‌కు, సప్నకు మధ్య కాస్త వివాదం రేగింది. ‘ఖామోషియా’ కథ చెప్పినప్పుడే ఆ సన్నివేశాలనూ వివరించాను. అప్పుడు ఒప్పుకొని తీరా సెట్స్‌ మీద ససేమిరా అంది’  అంటూ స్వప్న తీరును విమర్శించాడు విక్రమ్‌ భట్‌. ‘నిజమే.. కథ చెప్పినప్పుడు ఓకే అనిపించి ఒప్పుకున్నాను. కాని షూటింగ్‌ అప్పుడు నాకెందుకో నచ్చలేదు. నేనేం పోర్న్‌ స్టార్‌ని కాదుకదా..’ అని సమాధానమిచ్చింది సప్న. 

వెబ్‌ సిరీస్‌.. సినిమాల కన్నా స్మాల్‌ స్క్రీన్‌ మీదే సౌకర్యంగా ఫీలవుతున్నట్టుంది సప్న.  ఆమె యాక్టింగ్‌ పోర్ట్‌ఫోలియోలో వెబ్‌ సిరీస్‌ సంఖ్యే ఎక్కువ.  బిందాస్‌ వెబ్‌ చానెలో ‘ది ట్రిప్‌’, అమెజాన్‌లో బ్రీత్‌ – 1, ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ –2, నెట్‌ఫ్లిక్స్‌లో  ‘డ్రైవ్‌(సినిమా) స్ట్రీమ్‌ అవుతున్నాయి. 

పుస్తకాలు.. చదవడం ఆమె అభిరుచి. షూటింగ్స్‌ లేకపోయినా, విరామం దొరికనా పుస్తకం చదువుకుంటుంది. బయోగ్రఫీలు, ఫిలాసఫీలంటే ఎక్కువ ఇష్టపడుతుంది. తనకు అనిపించిందే చేస్తుంది. ఒపీనియన్‌ పోల్‌ను ఇష్టపడదు. బిందాస్‌గా ఉంటుంది.

మీటూ.. ఉద్యమంలో తనూశ్రీ దత్తకు అండగా నిలబడింది. ‘హాలీవుడ్‌లో ప్రతి ఒక్కరు సినిమాలతోపాటు టీవీలోనూ నటిస్తారు. ప్లాట్‌ఫామ్‌ లేదా మీడియం ఏంటీ అనేది ముఖ్యం కాదు వాళ్లకు. ఆర్టే ఇంపార్టెంట్‌. కాని బాలీవుడ్‌లో అలా కాదు. సినిమా, టీవీకి మధ్య గీత గీసుకున్నారు. దాన్ని బ్రేక్‌ చేయాలి. ఆ ఐస్‌ను బద్దలు కొట్టాలి. నా వరకు నాకైతే నటనే ముఖ్యం. ప్లాట్‌ఫామ్‌ కాదు’ అంటుంది సప్న పబ్బి.   

>
మరిన్ని వార్తలు