Saptagiri: 'పిల్లా... నువ్వు లేని జీవితం' డైరెక్ట‌ర్‌తో స‌ప్త‌గిరి సినిమా

19 Jan, 2022 09:27 IST|Sakshi

సప్తగిరి హీరోగా కొత్త సినిమా షురూ అయింది. ‘యజ్ఞం’, ‘పిల్లా... నువ్వు లేని జీవితం’ వంటి విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించిన ఏయస్‌ రవికుమార్‌ చౌదరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. రిగ్వేద క్రియేషన్స్‌పై ఎ.ఎస్‌. రిగ్వేద చౌదరి నిర్మించనున్నారు.

ఈ సందర్భంగా రిగ్వేద చౌదరి మాట్లాడుతూ– ‘‘వినూత్న కథాంశంతో నిర్మించనున్న చిత్రమిది. సప్తగిరి నుంచి ప్రేక్షకులు ఆశించే వినోదంతో పాటు కొత్త కథ, కథనాలు ఉంటాయి. ఫిబ్రవరిలో షూటింగ్‌ ప్రారంభిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సిద్ధం మనోహర్, సహనిర్మాత: దేవినేని రవి.

మరిన్ని వార్తలు