నేను హీరోను కాదు.. కేవలం: సోనూ సూద్‌

15 Aug, 2020 09:54 IST|Sakshi

సాయం చేయడానికి మంచి మనసుండాలే కానీ సాయం చేసేవారికి సరిహద్దులు వుండవని నిరూపిస్తున్నారు నటుడు సోనూ సూద్‌. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ సమయంలో వలస కూలీలకు సాయం చేయడంతో  సోనూ సూద్ పేరు దేశమంతా మార్మోగింది. వలస కూలీలను సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు బస్సులతోపాటు వివిధ రవాణా మార్గాలను ఏర్పాటు చేసి చాలా మంది హృదయాలను సోనూ దోచుకున్నారు. ఇలా తన సేవలతో, గొప్ప మనసుతో సోషల్ మీడియాలో సోనూ మంచి క్రేజ్ సంపాదించారు. దీంతో అందరిచేత ప్రశంసలందుకుంటున్నారు. సినిమాల్లో విలన్ అయినా.. నిజ జీవితంలో మాత్రం హీరో అయ్యాడని అంతా అభినందిస్తున్నారు. (సోనూసూద్‌ హామీ: రెండు రోజుల్లో వారంతా ఢిల్లీకి..)

ఈ క్రమంలో శనివారం 74వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో సోనూ సూద్‌ ఓ వీడియో విడుదల చేశారు. దేశమంతా తనను హీరోగా కొలుస్తున్నారని అయితే తను కేవలం మానవత్వం ఉన్న మనిషిగా సేవలు అందిస్తున్నట్లు ఈ వీడియో ద్వారా తెలిపారు. ప్రతి ఒక్కరి ప్రేమ, ఆశీర్వాదాలతోనే తన పనులు ఇంత గొప్పగా చేయగలుగుతన్నానని పేర్కొన్నారు. అయితే తనను అభినందించడం మాత్రమే కాకుండా ఇతరులకు సాయం చేయాలని అభిమానులను కోరారు. అలాగే సోనూ సూద్‌ చేస్తున్న మంచిపనితో అతని జీవత కథ ఆధారంగా బయోపిక్‌ తీసేందుకు కొంత మంది సంప్రదిస్తున్నారని ఆయన తెలిపారు. అందుకు సంతోషిస్తున్నానన్నారు. కానీ ఇలాంటి వాటిపై తనకు పెద్దగా ఆసక్తి లేదని చెప్పుకొచ్చారు. (‘సోనూ సూద్‌ పీఎస్‌4 కావాలి ప్లీజ్‌’)

‘ప్రతిరోజూ సాయం కోసం దాదాపు మెయిల్స్‌ వస్తున్నాయి. వేల మంది ట్వీట్‌ చేస్తున్నారు. కానీ వాళ్లందరికీ నేను సాయం చేయలేను.  ప్రతిరోజూ కనీసం 30 నుంచి 40 సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాను, ఇంకా ఎక్కువ చేయాలని ప్రయత్నిస్తున్నాను. నాకన్నా ఎక్కువ చేయగల సామర్థ్యం ఉన్న వ్యక్తులు కూడా ముందుకు వచ్చి సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. దేశభక్తికి నిజమైన అర్ధం తోటి వారికి అపద సమయంలో ఆదుకోవడమే’. అని హితవు పలికారు. (సోనూసూద్‌ అన్‌లిమిటెడ్‌ : వారి బాధ్యత నాదే)

Ab Hai Rojgar Ki Baari 👍 @pravasirojgar। Toll free number : 1800121664422

A post shared by Sonu Sood (@sonu_sood) on

మరిన్ని వార్తలు