బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆక్టటుకునే రియాలిటీ షో బిగ్‌బాస్. అభిమాన తారలంతా ఒకచోట చేరి చేసే సందడి చూడాలని, వారు ఇంట్లో ఎలా ఉంటారో తెలుసుకోవాలని ప్రేక్షకులు తెగ ఉవ్విళ్లూరుతుంటారు. నచ్చిన కంటెస్టెంట్లను మరికొన్నాళ్లు హౌస్‌లో ఉంచేందుకు ఓట్ల ప్రచారం చేస్తూ వారికి మద్దతుగా నిలబడుతుంటారు. అలా హౌస్‌లో పోటీదారుల కంటే బయట వారి అభిమానులు చేసే సందడే ఎక్కువగా ఉంటుంది. ఇక గత సీజన్ ఎంతగా క్రేజ్‌ను సంపాదించుకుందో ప్రత్యేకంగా చేప్పనవసరం లేదు. మునుపటి సీజన్స్ కంటే తెలుగు బిగ్‌బాస్ 4 మరెంతో పాపులరిటీ తెచ్చుకుంది.
టీఆర్పీ రేటింగ్‌లో కూడా ఈ సీజనే ముందు నిలిచింది. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ సీజన్ 5పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సీజన్ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో బుల్లితెర ప్రేక్షకుల ఉత్సుకతను మరింత పెంచేలా తాజాగా ఓ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సీజన్‌కు స్టార్ మా బడ్జెట్ రెట్టింపు చేసి వినూత్న రీతిలో ప్రేక్షకులను అలరించేందుకు ప్లాన్ చేస్తుస్తోందట. ఈ సారి ప్రముఖ సినీ, టీవీ తారలు, యూట్యూబ్ సెలబ్రెటీలు ఉండబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.
ఈ సారి ఫేమస్ కంటెస్టెంట్స్‌తో మంచి రసవత్తరంగా ఉండే ఈ సీజన్లో టాస్క్‌లు కూడా అంతేరేంజ్లో విభన్నంగా ఉండేలా సన్నాహాలు చేస్తున్నట్లు వినికిడి. ఇలా అయిదవ సీజన్‌ను ఓ రేంజ్‌కు తీసుకునేందుకు షో నిర్వాహకులు, మేకర్స్ కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. కొంతమంది బిగ్ సెలబ్రెటీలతో జూమ్‌తో ద్వారా చర్చలు జరపుతున్నారట. మరో విషయం ఏంటంటే ఈ సారి షో హోస్ట్ కూడా మారనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానున్న ఈ షో కంటెస్టెంట్స్, హోస్ట్ ఎవరన్నది త్వరలోనే ప్రకటించనున్నట్లు సమాచారం.