Subbaraya Sarma: అమ్మకు క్యాన్సర్‌.. నా దగ్గర ఎందుకని అనాధాశ్రమంలో వదిలేశా!

16 Feb, 2023 12:47 IST|Sakshi

పదుల సంఖ్యలో సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు సుబ్బరాయ శర్మ. మొదట నాటకరంగంలో పని చేసిన ఆయన మయూరి చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యాడు. ఒంటెద్దు బండి, శ్రీవారికి ప్రేమలేఖ, యమలీల, శుభలగ్నం, మాయలోడు, గంగోత్రి, మనసంతా నువ్వే, బాహుబలి: ది బిగినింగ్‌, రుద్రమదేవి వంటి చిత్రాలతో ఆయన మరింత పేరు తెచ్చుకున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.

'1977 నుంచి టీవీలో పని చేస్తున్నాను. 1985లో సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. నా ఫస్ట్‌ మూవీ మయూరి. దీనికి వెయ్యి లేదా పదిహేను వందల రూపాయలు పారితోషికం ఇచ్చి ఉంటారు. ఒకానొక సమయంలో అమ్మకు క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌ కోసం హాస్పిటల్‌లో జాయిన్‌ చేయాల్సి వచ్చింది. అప్పటివరకు నా దగ్గర ఎలా ఉంటుందని అనాధాశ్రమంలో జాయిన్‌ చేశా. ఎందుకంటే అప్పుడు నా భార్య అమెరికాలో ఉంది. నేను తనను చూసుకోలేనని అనాధాశ్రమంలో పెట్టాను. ఆ తర్వాత అక్కడి నుంచి అమ్మను హాస్పిటల్‌కు తీసుకెళ్లి ట్రీట్‌మెంట్‌ అయ్యాక మళ్లీ అక్కడ దింపి షూటింగ్‌కు వెళ్లేవాడిని. ఆ డబ్బుతో ఆస్పత్రి బిల్లు కట్టాను. నా పరిస్థితి తెలుసుకుని గుణశేఖర్‌ నాకు పదివేలు అడ్వాన్స్‌ ఇచ్చారు. అలా రెమ్యునరేషన్‌ ఇవ్వకుండా ఎగ్గొట్టినవాళ్లే కాకుండా ముందుగా డబ్బులిచ్చి సాయం చేసినవాళ్లు కూడా ఉన్నారు' అని తెలిపాడు సుబ్బరాయ శర్మ.

చదవండి: భర్త చనిపోయాక మొదటిసారి అలా కనిపించిన మీనా, వీడియో

మరిన్ని వార్తలు