సస్పెన్స్‌ సహస్ర

22 Nov, 2023 02:31 IST|Sakshi
సుధీర్, డాలీషా 

‘సుడిగాలి’ సుధీర్, డాలీషా జంటగా నటించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఫిల్మ్‌ ‘కాలింగ్‌ సహస్ర’. అరుణ్‌ విక్కిరాలా దర్శకత్వంలో విజేష్‌ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 1న విడుదల కానుంది.

ఈ చిత్రం ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో ముఖ్య అతిథి నిర్మాత బెక్కం వేణుగోపాల్‌ మాట్లాడుతూ– ‘‘థ్రిల్లింగ్‌ అంశాలతో రానున్న ఈ సినిమా ఆకట్టుకుంటుంది’’ అన్నారు. ‘‘గాలోడు’ హిట్‌తో నాకు మాస్‌ ఇమేజ్‌ వచ్చింది. ‘కాలింగ్‌ సహస్ర’తో సస్పెన్స్‌ జానర్‌లోకి అడుగుపెడుతున్నా’’ అన్నారు ‘సుడిగాలి’ సుధీర్‌. ‘‘ఇప్పటివరకు ఇలాంటి కథతో ఇండియన్‌ స్క్రీన్‌ మీద సినిమా రాలేదు’’ అన్నారు అరుణ్‌ విక్కిరాలా. ‘‘సినిమా బాగా వచ్చింది’’ అన్నారు విజేష్‌ తయాల్‌.

మరిన్ని వార్తలు