తెరచాప ఆడాలి 

4 Nov, 2023 02:48 IST|Sakshi
విశ్వక్‌ సేన్, నవీన్‌ రాజ్‌

విశ్వక్‌ సేన్‌

నవీన్‌ రాజ్‌ సంకరపు, పూజా సుహాసిని ముఖ్య తారలుగా నటిస్తున్న చిత్రం ‘తెరచాప’. జోయల్‌ జార్జ్‌ దర్శకత్వంలో కైలాష్‌ దుర్గం నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్‌ను హీరో విశ్వక్‌ సేన్‌ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘టైటిల్‌ డిజైనింగ్‌ బాగుంది.

ఈ సినిమా కథ, కథనం, టేకింగ్, అన్నీ నాకు తెలుసు. ఈ సినిమా బాగా ఆడి, చిత్ర యూనిట్‌కి మంచి విజయాన్ని చేకూర్చాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రజ్వల్‌ క్రిష్, కెమెరా: అజీమ్‌–వెంకట్‌.

మరిన్ని వార్తలు