-

టాలీవుడ్‌లోకి మరో నిర్మాణ సంస్థ.. ఒకేసారి మూడు సినిమాలు

26 Nov, 2023 20:52 IST|Sakshi

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి మరో కొత్త నిర్మాణ సంస్థ ఎంట్రీ ఇస్తోంది. మూడు సినిమాలని ఒకేసారి తీస్తున్న ఈ సంస్థ.. మొదటిగా ఓ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు రెడీ అయిపోయింది. ఆ సంస్థ పేరు బి.ఎమ్.క్రియేషన్స్. ఈ సంస్థ నుంచి వస్తున్న తొలి మూవీ పేరు 'వి లవ్ బ్యాడ్ బాయ్స్'. రాజు రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా దీన్ని తీస్తున్నారు. 

(ఇదీ చదవండి: యాంకర్ రష్మీకి పెళ్లి కుదిరిందా? అసలు విషయం ఏంటంటే!)

అజయ్, వంశీ ఏకశిరి, ఆదిత్య శశాంక్, రోమిక శర్మ, రోషిణి సహోట, ప్రగ్యా నయన్, సన్యు దవలగర్, వంశీకృష్ణ, సింధు విజయ్, విహారిక చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రఘు కుంచెతో కలిసి భూషణ్ జాన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటించనున్నట్లు చెప్పుకొచ్చారు.

(ఇదీ చదవండి: లవర్‌ని పరిచయం చేసిన 'జబర్దస్త్' నరేశ్.. కాకపోతే!)

మరిన్ని వార్తలు