పల్లెటూరి ప్రేమ కథ

17 Jul, 2023 06:21 IST|Sakshi

‘‘పల్లెటూరిలో జరిగే ప్రేమ కథే ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’. ఒక అనూహ్య ఘటన వల్ల హీరో, హీరోయిన్ల ప్రేమ కథ ఎలాంటి మలుపులు తిరిగింది? అనే థ్రిల్లింగ్‌  ఎలిమెంట్స్‌తో, పక్కా వాణిజ్య అంశాలతో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అని నిర్మాత యష్‌ రంగినేని అన్నారు. చైతన్య రావ్, లావణ్య జంటగా చెందు ముద్దు దర్శకత్వం వహించిన ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ ఈ నెల 21న విడుదలఅవుతోంది.

చిత్ర నిర్మాత యష్‌ రంగినేని మాట్లాడుతూ– ‘‘నాకు పాత తెలుగు సినిమాలంటే ఇష్టం. లండన్‌ వెళ్లినప్పుడు ఎన్టీఆర్‌గారి పాత సినిమాలు చూస్తుంటాను. ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ ని చెందు బాగా తీశాడు. నేను కూడా ఓ పాత్ర చేశాను. విజయ్‌ దేవరకొండతో మేము నిర్మించిన ‘పెళ్ళి చూపులు, డియర్‌  కామ్రేడ్‌’ సినిమాలను త్వరలో రీ రిలీజ్‌ చేస్తాం’’ అన్నారు.

మరిన్ని వార్తలు