ఇంట్లో నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో.. వెళ్లి చూడగా.. షాక్!

7 Nov, 2023 12:29 IST|Sakshi
స్వరూపారాణి (ఫైల్‌)

బాత్‌రూంలో మహిళ అనుమానాస్పద స్థితిలో..

ముఖం కాలిపోయి అప్పటికే మృతి!

గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారా? లేక..

సాక్షి, నల్గొండ/సూర్యాపేట: బాత్‌రూంలో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘటన సూర్యాపేట పట్టణంలోని సీతారాంపురం కాలనీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీతారాంపురం కాలనీలో నివాసముంటున్న అనుములపురి స్వరూపరాణి(53) సూర్యాపేట మండలంలోని కాసరబాద్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్‌ నర్సుగా పనిచేస్తుంది. ఆమె భర్త గతంలోనే చనిపోయాడు. ఒక కుమార్తె ఉండగా ఆమెకు వివాహం చేసింది. స్వరూపరాణి ఒంటరిగానే ఉంటుంది.

ఆదివారం రాత్రి ఆమె ఇంట్లో నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో కాలనీవాసులు వెళ్లి చూడగా బాత్‌రూంలో స్వరూపరాణి ముఖం కాలిపోయి అప్పటికే మృతిచెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్వరూపరాణి బాత్‌రూంలో కరెంట్‌ షాక్‌తో కిందపడి చనిపోయిందా.. లేదా గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.
ఇవి కూడా చదవండి: తల్లి మందలించిందని.. ఇంట్లో నుంచి వెళ్లి.. చివరికి..

మరిన్ని వార్తలు