కేంద్రం ఇవ్వకున్నా మేమిస్తాం: 23 రాష్ట్రాలు

26 Apr, 2021 16:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం 45 ఏళ్ల పైబడిన వారికి ఉచితంగా టీకా అందించగా ప్రస్తుతం 18-45 ఏళ్ల వారికి మే 1వ తేదీ నుంచి వ్యాక్సిన్‌ అందించాలని నిర్ణయించింది. అయితే వారికి మాత్రం ఉచితమని చెప్పలేదు. దీంతో ఆ వయసు వారు బయట కొనుక్కుని వేసుకోవాల్సిన పరిస్థితి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా తాము ఉచితంగా టీకా అందిస్తామని దేశంలోని అన్ని రాష్ట్రాలు ముందుకువచ్చాయి. 18-45 ఏళ్ల వారికి ఉచితంగా టీకా అందిస్తామని ఏకంగా 23 రాష్ట్రాలు ప్రకటించాయి. ఇక తెలంగాణతో పాటు మరో రెండు, మూడు రాష్ట్రాలు వయసుతో నిమిత్తం లేకుండా ఉచితంగా టీకా అందిస్తామని ప్రకటించాయి.

ఇప్పటివరకు 19.19 కోట్ల వ్యాక్సిన్‌ను 45 ఏళ్లు పైబడిన వారికి వినియోగించారు. మే 1వ తేదీ నుంచి 18 నుంచి 45 ఏళ్ల వయసు వారికి వ్యాక్సిన్‌కు కేంద్రం అనుమతి ఇచ్చింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వ్యాక్సినే దానికి విరుగుడుగా భావిస్తున్నారు. ఈ క్రమంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను అన్ని రాష్ట్రాలు వేగవంతం చేశాయి. ఈ నేపథ్యంలో అందరికీ వ్యాక్సిన్‌ వేయించాలని సంకల్పించాయి. ప్రజలకు ఉచితంగా టీకా వేసేందుకు ముందుకు వచ్చాయి. 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు 23 రాష్ట్రాలు ఉచితంగా టీకా అందిస్తామని ముందుకు వచ్చాయి. ఇక తెలంగాణ ప్రభుత్వం వయసు నిమిత్తం లేకుండా అన్ని వయసుల వారికి ఉచితంగా టీకా అందిస్తామని ప్రకటించింది. ఉచితంగా టీకా అందిస్తామని ప్రకటించిన రాష్ట్రాలు ఇవే..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హరియాణా, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్, అసోం, గోవా, ఒడిశా, ఢిల్లీ, జమ్మూ కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్, రాజస్తాన్‌.

చదవండి: మాస్క్‌ లేదని చితక్కొట్టిన ఆర్టీసీ బస్‌ డ్రైవర్‌
చదవండి: ఎన్నికల సంఘం బీజేపీ గూటి చిలక

>
మరిన్ని వార్తలు