హోం ఐసోలేషన్‌.. కేంద్రం కొత్త గైడ్‌లైన్స్‌

29 Apr, 2021 18:03 IST|Sakshi

హోం ఐసోలేషన్‌లో ఉన్న వారు 3 లేయర్ల మాస్క్‌ ధరించాల్సిందే

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్‌ బారిన పడి ఇంట్లోనే ఉండే ట్రీట్మెంట్‌ తీసుకుంటున్న బాధితులకు సంబంధించి కేంద్రం ఆరోగ్య శాఖ నూతన మార్గదర్శకాల్ని విడుదల చేసింది. హోం ఐసోలేషన్‌లో ఉన్న బాధితులు తప్పనిసరిగా ట్రిపుల్ లేయర్ మెడికల్ మాస్క్‌ను వినియోగించాలని సూచించింది. ఎనిమిది గంటల తర్వాత వాటిని పడేయాలని తెలిపింది. అలానే హోం ఐసోలేషన్‌లో ఉన్న వారి వద్దకు కుటుంబసభ్యులు ఎవరైనా వస్తే..  బాధితుడు, కుటుంబ సభ్యుడు ఇద్దరూ ఎన్‌ 95 మాస్క్‌ ను ధరించాలని స్పష్టం చేసింది.

1 శాతం సోడియం హైపోక్లోరైట్‌తో క్రిమిసంహారకం చేసిన తర్వాత మాత్రమే మాస్క్‌ను తొలగించాలని సూచించింది. కరోనా బారిన పడిన వారు తగినంత విశ్రాంతి తీసుకోవాలని.. ద్రవాహారం ఎక్కువగా తీసుకోవాలని సూచించింది. దేశంలో ఒకే రోజు 3,79,257 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదు కావడంతో కేంద్రం ఈ కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేసింది. కాగా దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,83,76,524 కు చేరుకోగా యాక్టీవ్‌ కేసుల సంఖ్య 30 లక్షలు దాటినట్లు తెలుస్తోంది.  

చదవండి: మాస్క్‌ పెట్టుకోనందుకు ప్రధానికి రూ.14 వేల జరిమానా

మరిన్ని వార్తలు