క‌రోనా : ఆ ఐదు రాష్ర్టాల్లో అధికం

6 Oct, 2020 09:29 IST|Sakshi

న్యూఢిల్లీ :  భార‌త్‌లో గ‌త మూడు వారాలుగా క‌రోనా తీవ్ర‌త తగ్గుముఖం ప‌ట్టిన‌ప్ప‌టికీ ప్ర‌ధానంగా ఐదు రాష్ర్టాల్లో మాత్రం కేసులు పెరిగాయి. సెప్టెంబ‌ర్ 13 నుంచి అక్టోబ‌ర్‌4 వ‌ర‌కు దేశ వ్యాప్తంగా క‌రోనా తీవ్ర‌త 56% నుంచి 37% కి ప‌డిపోయింది. అయితే కేర‌ళ‌, ఛ‌త్తీస్‌గ‌డ్, ఉత్త‌రాఖండ్, ఒడిశా, మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ర్టాల్లో మాత్రం గ‌త మూడు వారాలుగా క‌రోనా తీవ్ర‌త పెరిగిన‌ట్లు నివేదిక‌లో వెల్ల‌డైంది. అత్య‌ధికంగా కేర‌ళ‌లో క‌రోనా తీవ్ర‌త  112% కి పెర‌గ‌గా, ఛ‌త్తీస్‌గ‌డ్‌లో  93%, , ఉత్త‌రాఖండ్‌లో  61%, ఒడిశా, మధ్యప్రదేశ్‌లలో 54% అధికంగా కోవిడ్ కేసులు నమోదైన‌ట్లు గ‌ణాంకాల్లో తేలింది. (వారికి సింగపూర్ బంపర్ ఆఫర్)

గ‌త మూడు వారాల్లో అత్య‌ల్పంగా బీహార్‌లో క‌రోనా తీవ్ర‌త 19%కి పడిపోయింది. త‌మిళ‌నాడు 23%, గుజరాత్ 26% వృద్ధిరేటును న‌మోదు చేసుకుంది. దేశంలోనే అత్య‌ధిక క‌రోనా కేసుల‌తో ముంద‌జ‌లో ఉన్న మ‌హారాష్ర్ట‌లో క‌రోనా కేసులు  36% కి పెర‌గ‌గా, కర్ణాటకలో 39%కి పెరిగింది.  ఇక తెలుగు రాష్ర్టాలైన తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్టాల్లో   27%, క‌రోనా కేసులు పెరిగిన‌ట్లు డేటాలో వెల్ల‌డైంది. భార‌త్‌లో క‌రోనా కేసులు న‌మోద‌వుతున్నా అదే స్థాయిలో రిక‌వ‌రీ రేటు సైతం పెరుగుతుండ‌టం ఊర‌ట క‌లిగిస్తుంది. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో 6.6 మిలియన్లకు పైగా క‌రోనా కేసులు న‌మోద‌వ‌గా, 102,685 మంది మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. (10 మందిలో ఒకరికి కరోనా: డబ్ల్యూహెచ్‌వో)

మరిన్ని వార్తలు