Covid-19: దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 760 కరోనా కేసులు!

4 Jan, 2024 13:06 IST|Sakshi

కరోనా కొత్త వేరియంట్ జేఎన్‌-1 కేసులు భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాలలో పెరుగుతున్నాయి. మీడియాకు అందిన సమాచారం ప్రకారం చైనాతో సహా అనేక దేశాలలో కరోనా బాధితులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. కరోనా మరణాలు కూడా నమోదవుతున్నాయి. 

భారతదేశంలో గత 20 రోజులుగా ప్రతిరోజూ కొత్తగా  సగటున 500 కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో కొత్తగా 760 మందికి ఇన్ఫెక్షన్ నిర్ధారితమయ్యింది. జేఎన్‌-1 వేరియంట్ ఇప్పటివరకు దేశంలోని 11 రాష్ట్రాలకు వ్యాపించింది.  దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 4423కు చేరింది.

కరోనా ముప్పు పెరుగుతోందని, దీని నివారణకు అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పెరుగుతున్న కేసుల దృష్ట్యా కేంద్రం.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. ప్రస్తుతం కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో దేశంలో కోవిడ్ కారణంగా ఐదు మరణాలు నమోదయ్యాయని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సిడిసి) తెలిపింది.

>
మరిన్ని వార్తలు