కరోనా నెగిటివ్‌.. హోం ఐసోలేషన్‌: అమిత్‌ షా

14 Aug, 2020 18:03 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనాను జయించినట్లు తెలిపారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా. శుక్రవారం జరిపిన పరీక్షలో తనకు నెగిటివ్‌ వచ్చిందన్నారు. ఈ మేరకు అమిత్‌ షా ట్వీట్‌ చేశారు. ‘ఈ రోజు నాకు కరోనా టెస్ట్‌ రిపోర్టులో నెగిటివ్‌ వచ్చింది. ఈశ్వరుడికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకున్న వైద్య సిబ్బందికి ధన్యవాదాలు. మరి కొద్ది రోజుల పాటు వైద్యులు నన్ను హోం ఐసోలేషన్‌లో ఉండమన్నారు. వారి సూచనలు పాటిస్తాను’ అంటూ అమిత్‌ షా హిందీలో ట్వీట్‌ చేశారు. (క‌రోనా : మ‌రో ఆందోళ‌న క‌లిగించే విష‌యం!)

రెండు వారాల క్రితం ఈ నెల 2న అమిత్‌ షాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన గురుగావ్‌ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఎయిమ్స్‌ వైద్య బృందం ఆయనకు చికిత్స చేశారు. మరో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కూడా కరోనాతో ఈ ఆస్పత్రిలోనే చేరి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం భారత్‌లో 6,61,595 యాక్టివ్‌ కేసులు ఉండగా.. 17,51,556 మంది కోలుకున్నారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ శుక్రవారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. నిన్న 8,48,728 టెస్టులు చేయగా ఇప్పటి వరకు 2,76,94,416 కరోనా నిర్ధారణ పరీక్షలు పూర్తి చేశారు.

మరిన్ని వార్తలు