Blouse Mehndi: మెహందీని ఇలా కూడా వాడుతున్నారా!

30 Nov, 2021 18:17 IST|Sakshi

చేతి నిండా ఎర్రగా పండే.. ‘మెహందీ’ అంటే ఇష్టంలేని మహిళలు ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే ఇప్పటి వరకు మెహంది అనగానే చేతులు, కాళ్లు, కొన్ని సార్లు తెల్లజట్టుకు వేసుకోవటం తెలుసు. అయితే రోజురోజుకు మహిళలు కొత్త ఫ్యాషన్‌ ఫాలో అవుతూ ట్రెండీగా మెరిసిపోతున్నారు.

మార్కెట్లోకి కొత్తగా వచ్చే ప్రతి ఫ్యాషన్‌ బ్రాండ్లను వాడుతున్నారు. భిన్నమైన చుడీదార్లు, డిజైన్‌ శారీలు, బ్లౌజులు వేసుకొని ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు. అయితే తాజాగా మెహందీ బ్లౌజ్‌ వేసుకున్న ఓ మహిళకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది.

ఈ వీడియోను థానోస్ జాట్ అనే ఓ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.​ మెహందీ బ్లౌజ్‌ ఎలా ఉంటుందని ఆశ్చర్యపోతున్నారా? అయితే సాధారణంగా ధరించే బ్లౌజ్‌కు బదులుగా శరీరంపై హెన్నా(మెహంది) డిజైన్‌ వేసుకోవడం. ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు.. ‘కొత్తగా  ఉంది డిజైన్‌’.. ‘మెహందీని ఇలా కూడా వాడుతున్నారా?’.. అసలు బ్లౌజ్‌గా మెహందీని వేసుకోవడం ఏంటీ? అంటూ కామెంట్లు చేస్తున్నారు.     ​  

A post shared by Thanos (@thanos_jatt)

మరిన్ని వార్తలు