ఎంపీలు రెడ్డప్ప, మాధవిలకు పాజిటివ్‌

14 Sep, 2020 09:13 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ : చిత్తూరు వైఎస్సార్‌సీపీ ఎంపీ రెడ్డప్ప కరోనా వైరస్‌ బారినపడ్డారు. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన ఎంపీకి పార్లమెంట్ సచివాలయంలో నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. ఎటువంటి లక్షణాలు లేకుండానే కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఐసోలేషన్‌లో ఉండాలని అధికారులు సూచించారు. అరకు ఎంపీ మాధవికి కూడా కరోనా సోకింది. గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఎంపీ.. పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో రెండు వారాల పాటు ఢిల్లీలోనే చికిత్స తీసుకోనున్నారు. 

కాకినాడ ఎంపీ వంగ గీతా సైతం ఇదివరకే వైరస్‌ బారినపడిన విషయం తెలిసిందే. గత శనివారం ఆమెకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. కాగా దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ కారణంగానే ప్రత్యేక పరిస్థితుల నడుమ పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్నాయి. మరోవైపు దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 24 మంది ఎంపీలకు, 8 మంది కేంద్రమంత్రులకు కరోనా పాజిటవ్‌గా తేలింది. ఇక స్వల్ప లక్షణాలు ఉన్నా.. సభలోకి అనుమతి లేదని స్పీకర్‌ ఇదివరకే ప్రకటించారు. (పార్లమెంట్‌లో కరోనా కలకలం..!)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు