Kolkata: అయోధ్యపై టీఎంసీ వ్యాఖ్యలను తిప్పికొట్టిన బీజేపీ

5 Mar, 2024 12:18 IST|Sakshi

పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామేందు సిన్హా రాయ్ అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నూతన రామాలయాన్ని అపవిత్ర ప్రదేశంగా అభివర్ణించారు.  హిందువులెవరూ ఇలాంటి అపవిత్ర ప్రదేశంలో పూజలు చేయకూడదని కూడా అన్నారు. 

హుగ్లీ జిల్లాలోని తారకేశ్వర్‌కు చెందిన తృణమూల్ ఎమ్మెల్యే  రామేందు సిన్హా రాయ్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.  తృణమూల్ ఎమ్మెల్యేపై  పోలీసులకు ఫిర్యాదు చేస్తామని అన్నారు. 

సువేందు తన ట్విట్టర్‌  హ్యాండిల్‌లో తృణమూల్‌పై విరుచుకుపడ్డారు.. అధికార పార్టీ నేతల మాటలు హిందువులపై జరుగుతున్న దాడులకు నిదర్శనం అని అన్నారు. శ్రీరాముని ఆలయాన్ని ‘అపవిత్రం’ అని అభివర్ణించేంతలా వారి వైఖరి మారిపోయిదన్నారు. ఇది తృణమూల్ నేతల భావజాలాన్ని వెల్లడిస్తుందన్నారు.
 

whatsapp channel

మరిన్ని వార్తలు