కరోనా విలయం: సోమవారం ఒక్కరోజే 1,761 మంది మృతి

20 Apr, 2021 09:56 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విలయ తాండవం కొనసాగుతోంది. కోవిడ్‌ రెండో దశ వ్యాప్తి ప్రమాదకరంగా తయారవుతోంది. రోజులు గడుస్తున్న​ కొద్దీ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కరోనా మరణాలు సైతం ప్రజలను తీవ్ర భయందోళనకు గురిచేస్తున్నాయి. గత ఆరు రోజులుగా 2 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 2,59,170 పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. సోమవారం రోజు 1761 మంది కోవిడ్‌తో ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం హెల‍్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

మొత్తం కేసుల సంఖ్య 1,53,21,089కు చేరింది. మరణాల సంఖ్య 1,80,550కు పెరిగింది. నిన్న 1,54,761 మంది డిశ్చార్జి అవ్వగా ఇప్పటి వరకు1,31,08,582 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 20,31,977 యాక్టివ్‌ కేసులున్నాయి. సోమవారం వరకు మొత్తం 12,71,29,113 మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారు. 

చదవండి: భయపడొద్దు.. వ్యాక్సిన్‌లో కరోనా వైరస్‌ ఉండదు 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు